అరెస్ట్‌పై హిమ‌జ ఏమంటోందంటే…!

హైద‌రాబాద్ శివార్ల‌లోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వ‌హిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్‌-3 కంటెస్టెంట్ హిమ‌జ‌తో పాటు మ‌రికొంద‌రు సినీ సెలబ్రిటీల‌ను పోలీసులు అరెస్ట్ చేశార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ వార్త‌ల‌పై…

హైద‌రాబాద్ శివార్ల‌లోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వ‌హిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్‌-3 కంటెస్టెంట్ హిమ‌జ‌తో పాటు మ‌రికొంద‌రు సినీ సెలబ్రిటీల‌ను పోలీసులు అరెస్ట్ చేశార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ వార్త‌ల‌పై హిమ‌జ స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ఒక వీడియోను విడుద‌ల చేశారు.

మొద‌ట‌గా అంద‌రికీ ఆమె దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. మొద‌టిసారిగా త‌న కొత్త ఇంట్లో దీపావ‌ళి జ‌రుపుకోవాల‌ని నిర్ణ‌యించుకుని కుటుంబ స‌భ్యుల‌తో పాటు కొంత మంది శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించిన‌ట్టు ఆమె తెలిపారు. అయితే అంద‌రూ క‌లిసి పార్టీ చేసుకుంటున్న స‌మ‌యంలో ఎవ‌రో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చార‌ని తెలిపారు. ఏదో జ‌రుగుతోంద‌నే ఉద్దేశంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని ఆమె చెప్పుకొచ్చారు.  

పోలీసులు త‌న ఇంటికి వ‌చ్చి అస‌లేం జ‌రుగుతున్న‌దో చెక్ చేశార‌ని హిమ‌జ చెప్పారు. పోలీసుల‌కు తాము స‌హ‌క‌రించామ‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో ఏం జ‌రుగుతుందో అని త‌న ఇంట్లో సోదాలు చేశార‌న్నారు. అంతా చ‌ట్ట‌బ‌ద్ధంగా జ‌రుగుతుంద‌ని పోలీసులు తెలుసుకున్నార‌ని హిమ‌జ వెల్ల‌డించారు. రేవ్ పార్టీని భ‌గ్నం చేసిన‌ట్టుగా వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని ఆమె వెల్ల‌డించారు. 

త‌న అరెస్ట్‌పై వార్త‌లు రావ‌డంతో స్నేహితులు త‌న‌కు ఫోన్లు చేస్తున్నార‌ని ఆమె తెలిపారు. అంద‌రికీ వాస్త‌వం ఏంటో చెప్ప‌డానికి ఈ వీడియో చేసిన‌ట్టుగా ఆమె వెల్ల‌డించారు. నిజంగా త‌న‌ను అరెస్ట్ చేసి వుంటే వీడియో చేసి వుండేదాన్ని కాద‌ని ఆమె చెప్పుకొచ్చారు.