హిట్ 2 హిట్ కు వెనుక ముందు

నాని నిర్మాతగా అడవి శేష్ హీరోగా శైలేష్ దర్శకత్వంలో తయారైన సినిమా హిట్ 2. ఈ సినిమా అన్ని వైపుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆర్థికంగా దీని పరిస్థితి ఏమిటి? నిర్మాతగా…

నాని నిర్మాతగా అడవి శేష్ హీరోగా శైలేష్ దర్శకత్వంలో తయారైన సినిమా హిట్ 2. ఈ సినిమా అన్ని వైపుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆర్థికంగా దీని పరిస్థితి ఏమిటి? నిర్మాతగా నాని హ్యాపీయేనా? అని ఆరా తీస్తే ఫుల్ హ్యాపీనే అని క్లారిటీ వుచ్చింది. హిట్ సినిమాకు సమస్య ఒక్కటే 26 నెలల పాటు సెట్ మీద వుండడం. దీని వల్ల రెండు సమస్యలు ఒకటి నిర్మాణ భారం, రెండవది వడ్డీల భారం. దీని వల్ల నిర్మాణ భారం 23 కోట్లు దాటింది.

మేజర్ సినిమా కన్నా ముందుగా మొదలైన సినిమా. అందుకే హీరో అడవి శేష్ కు ఓల్డ్ కమిట్ మెంట్ కింది మూడున్నర కోట్లు రెమ్యూనిరేషన్ అందింది. ఇప్పుడు అయితే కనీసం ఏడు కోట్ల మేరకు వుండేది. డైరక్టర్ తొలి సినిమా ఇదే బ్యానర్ లో. ఇది మలి సినిమా. అతనికి కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ అందింది.

ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే సినిమా డిజిటల్ రైట్స్ అప్పట్లోనే అమ్మేసారు. మేజర్ సినిమా తరువాత అమ్మి వుంటే భారీ రేట్ వచ్చేది. అప్పట్లో నాలుగున్నర కోట్లకు ఇచ్చేసారు. సినిమా థియేటర్ రైట్స్ (నైజాం మినహా) 14 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. నైజాం ను నాలుగు కోట్ల అడ్వాన్స్ మీద విడుదల చేసుకున్నారు. ఆ విధంగా రాబడికి పెట్టుబడికి అక్కడికక్కడ సరిపోయింది.

ఇప్పుడు నైజాంలో, ఓవర్ సీస్ లో అదనంగా వచ్చేది లాభం. పైగా సినిమా తేడా కొడితే జీఎస్టీ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. పైగా ఇక్కడ కీలకం ఏమిటంటే హిట్..హిట్ 2 బజ్ వల్ల హిట్ 3 సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అప్పుడు వుంటుంది అసలు లాభం.