ప్రస్తుతం థ్రిల్లర్ల టైమ్ నడుస్తోంది. ఇంట్రస్టింగ్ గా వున్న చిన్న పాయింట్ తీసుకుని, రీజనబుల్ బడ్జెట్ లో సినిమా తీసి వదిల్తే సేఫ్ జోన్ కు వస్తోంది. ఇటీవలే నాగశౌర్య అశ్వద్దామ సినిమా విడుదలై, బయ్యర్లు హ్యాపీ అనిపించేసుకుంది. అలాంటి సినిమా అనిపించేట్లుగా మరోటి వస్తోంది. హీరో నాని హోమ్ బ్యానర్ మీద విష్వక్ సేన్ హీరోగా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెలాఖరులో విడుదలయ్యే ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు.
ఓ అమ్మాయి అదృశ్యం కేసు మీద పరిశోధన అన్నట్లుగా ట్రయిలర్ స్టోరీని కాస్త రివీల్ చేసింది. ట్రయిలర్ చూడగానే అశ్వద్ధామ గుర్తుకు వస్తుంది. అయితే అందులో పలువురు అమ్మాయిలకు జరిగిన అన్యాయం పాయింట్. కానీ ఇందులో కేవలం ఒక అమ్మాయి అదృశ్యం కేసును పరిశోధించడం పాయింట్.
వరుసగా థ్రిల్లర్లు చూసేస్తూ రావడం వల్ల కాస్త క్యాజువల్ అనిపించినట్లు ట్రయిలర్ వుంది కానీ, సినిమాలో విషయంలో క్వాలిటీ వున్నట్లు తెలుస్తోంది. ట్రయిలర్ ను ఆసక్తికరంగానే కట్ చేసారు. విష్వక్ సేన్ బాగానే సెట్ అయ్యాడు పోలీస్ పాత్రలో. కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ట్రయిలర్ ఒకె అనిపించేసుకుంది..