ఇండియన్ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా మారి విదేశీ ప్రేక్షకుల్ని సైతం ఎలా ఆకట్టుకుంటుందో.. భారతీయ వంటకాలు కూడా పాన్ ఇండియా రేంజ్ ను దాటి, ఇంటర్నేషనల్ ఫుడ్ గా మారి అన్ని ప్రాంతాలవారినీ నోరూరిస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది హాలీవుడ్ నటులు భారతీయ వంటకాలను ఇష్టపడుతున్నారు. ఏదో ఒక సందర్భంలో భారత్ రావడం, ఇక్కడి ఆహారాన్ని ఇష్టపడటం, ఆ తర్వాత తమ ప్రాంతానికి తిరిగి వెళ్లినా కూడా దాన్ని మరచిపోలేకపోతున్నారు.
అవెంజర్స్ ఫేమ్ పాల్ రాడ్ అమెరికా నటుడు. కుటుంబంతో కలసి భోజనం కోసం బయటకొచ్చాడంటే కచ్చితంగా ఇండియన్ ఫుడ్ ఉన్న రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. లేకపోతే ఆయన కూతురు ఊరుకోదు. పాల్ సహా వారి కుటుంబమంతటికీ లక్నో బిర్యానీ అంటే బాగా ఇష్టం. న్యూయార్క్ లోనే కాదు, లండన్ వెళ్లినా కూడా ఆ బిర్యానీ వారికి కావాల్సిందే.
మోస్ట్ బ్యూటిఫుల్ వుమన్ ఇన్ ది వరల్డ్ గా ఐదుసార్లు పీపుల్స్ మేగజీన్ సర్వేలో గెలిచిన నటి జూలియా రాబర్ట్స్ కి కూడా భారతీయ వంటకాలంటే బాగా ఇష్టం. చెమటలు కక్కుకుంటూనే ఇక్కడి ఘాటు రుచుల్ని ఆస్వాదిస్తుంటారు ఫుడ్ లవర్స్ అని అంటుంది జూలియా. ఆమెకు కూడా భారతీయ స్పైసీ వంటకాలంటే భలే ఇష్టం.
టైటానిక్ ఫేమ్ బ్రాడ్ పిట్ కి కూడా భారతీయ వంటకాలంటే బాగా ఇష్టం. చికెన్ కుర్మా, బటర్ చికెన్, గార్లిక్ నాన్.. ఆయన ఫేవరెట్ ఫుడ్ ఇది. రెస్టారెంట్ కి వెళ్లారంటే ముందు ఇండియన్ వెరైటీలను, అందులోనూ చికెన్ వెరైటీలను ఆయన అడుగుతారట.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆర్టిస్టుల్లో ఒకరైన టామ్ క్రూస్ కి కూడా భారతీయ వంటకాలంటే బాగా ఇష్టం. చికెన్ టిక్కా మసాలా ఆయన ఫేవరెట్ ఫుడ్. లండన్ లో ఆశాభోస్లే ప్రారంభించిన రెస్టారెంట్ కి తరచూ వస్తుంటాడు టామ్. అక్కడే ఆయన చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ ఇస్తారు.
ప్రముఖ గాయని మడోనాకు సౌతిండియన్ ఫుడ్ బాగా ఇష్టం. ఇడ్లీ ఆకలి తీర్చడంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని అంటారు. జానీ డెప్ కి చికెన్ టిక్కా మసాలా, రొయ్యల సమోసా, దాల్ మఖానీ అంటే బాగా ఇష్టం. బర్మింగ్ హామ్ లోని వారణాసి రెస్టారెంట్ కి ఆయన రెగ్యులర్ కస్టమర్ కూడా. గాయని, నటి.. లేడీ గాగా కూడా ఇండియన్ ఫుడ్ ని బాగా ఇష్టపడతారు. భారతీయ కూరలంటే ఆమెకు బాగా ఇష్టం. ముఖ్యంగా కాస్త ఘాటుగా ఉండే మసాలాలను ఆమె బాగా లాగించేస్తారట. ఇదీ హాలీవుడ్ నటీనటులకు భారతీయ వంటకాలపై ఉన్న ప్రేమ.
Kani ikkada india lo chaalaa mandiki pizaa, burgers, noodles istam