అంటే సుందరానికి అనే సినిమా అందించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. మంచి బజ్ తో విడుదలయిందీ సినిమా. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. అలా అని వివేక్ కు చాన్స్ ల కొదవ లేదు.
మైత్రీ సంస్థలో మరో సినిమా ఆఫర్ వుంది. డివివి దానయ్య కు ఓ సినిమా చేయాల్సి వుంది. హీరో నాని నే మళ్లీ మరో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇప్పటికి అది మెటీరియలైజ్ అయింది. నిర్మాత దానయ్య-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.
కచ్చితంగా ఈ కాంబినేషన్ బాగుండేదే. ఎక్కడో మిస్ ఫైర్ అయింది కానీ వివేక్ ఆత్రేయ సెన్సిబుల్ డైరక్టర్. నానికి వున్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ కు సరిపోయే డైరక్టర్. బహుశా అందుకే మళ్లీ మరో చాన్స్ ఇవ్వాలని నాని డిసైడ్ అయి వుండొచ్చు. నాని ఇప్పుడు దసరా సినిమా పూర్తి చేసి, సివిఎమ్ నిర్మించే సినిమా మీద వున్నారు. దాని తరువాత ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా ఓ సినిమా చేయాల్సి వుంది. ఇవన్నీ కాక హిట్ 3 కూడా నాని నే చేయాల్సి వుంది.
నాని తన సినిమాలను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఫన్ ఎంటర్ టైన్మెంట్,. మాస్.. సీరియస్.. ఇలా ఒకదాని వెనుక ఒకటి అన్నట్లు వెళ్తున్నాడు. దసరా ఫుల్ సీరియస్, రఫ్ సినిమా. తరువాత చేస్తున్నది ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ జానర్ సినిమా.