Advertisement

Advertisement


Home > Movies - Movie News

సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం

సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం

దివంగత సినీ కవి సిరివెన్నెల కుటుంబం పట్ల ఆంధ్ర సిఎమ్ చాల గౌరవంతో వుంటూ వస్తున్నారు. సిరివెన్నెల ఆసుపత్రి ఖర్చులు అన్నీ ప్రభుత్వమే చూసింది. సిరివెన్నెల సాహిత్యాన్ని జగన్ నే ఆవిష్కరించారు. ఇప్పుడు లేటెస్ట్ గా సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. 

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేకంగా వేసిన వుడా లే అవుట్ లో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ జీవొ విడుదల చేసారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి పెరిగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. యోగి మాస్టారుగా అనకాపల్లిలో సిరివెన్నెల తండ్రికి చాలా పేరు వుండేది. ఆ తరువాత సిరివెన్నెల సోదరులు అంతా విశాఖలోనే స్థిరపడ్డారు. హైదరాబాద్ లో సెటిల్ అయినా సిరివెన్నెల కుటుంబం మూలాలు అన్నీ విశాఖ లోనే వున్నాయి. అందువల్ల అక్కడ స్థలం ఇవ్వడం సముచితమైన నిర్ణయం.

విశాఖ జూ గోడకు ఆనుకుని, బీచ్ వైపు వేసిన లేఅవుట్ చాలా కీలకమైన ప్రాంతంలో వుంది. ఇక్కడే స్థలం కేటాయించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?