టెక్ దిగ్గజం ఇంటెల్ సహవ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్(94) కన్నుమూశారు. 94ఏళ్ల మూర్ హవాయిలోని తన ఇంట్లో కనుమూసినట్లు ఇంటెల్ సంస్థ ప్రకటించింది.
గోర్డాన్ మూర్ 1968లో రాబర్ట్ నాయిస్, ఆండీ గ్రోవ్ లతో కలిసి ఇంటెల్ సంస్థను స్థాపించారు. ప్రాసెసర్ల ఉత్పత్తిలో టెక్ ప్రపంచంలో విప్లవానికి నాంది పలికారు. ఇప్పటికీ అధిక శాతం కంప్యూటర్లలో ఇదే సంస్థకు చెందిన ప్రాసెసర్లను వాడుతున్నారు.
కార్లలో ఆటోమెటిక్ కంట్రోల్స్, పోర్టబుల్ కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్(స్మార్డ్ ఫోన్) వంటి టెక్నాలజీ వస్తుందంటూ 1960ల్లోనే మూర్ అంచగా వేశారు. దీనిని మూర్స్ లా గా టెక్ ప్రపంచం పరిగణిస్తుంది. మూర్ 2006లో ఇంటెల్ నుండి పదవీ విరమణ చేసాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మూర్ మరణానికి విచారం వ్యక్తం చేశారు.