ఇక పెళ్లి చేసుకోకుండా ఆగ‌లేనంటున్న యంగ్ హీరో…

క‌రోనా కాదు క‌దా, ఏ విప‌త్తు వ‌చ్చినా నిర్ణీత ముహూర్తానికి మాత్రం పెళ్లి జ‌ర‌గాల్సిందే అని ఆ హీరో తెగేసి చెబుతున్నాడు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు, ఫంక్ష‌న్లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు వాయిదా…

క‌రోనా కాదు క‌దా, ఏ విప‌త్తు వ‌చ్చినా నిర్ణీత ముహూర్తానికి మాత్రం పెళ్లి జ‌ర‌గాల్సిందే అని ఆ హీరో తెగేసి చెబుతున్నాడు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు, ఫంక్ష‌న్లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి కూడా క‌రోనాను దృష్టిలో పెట్టుకుని వాయిదా ప‌డింద‌నే వ‌దంతులు వ్యాపించాయి.

ఆ వ‌దంతుల‌పై నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. త‌న పెళ్లి వాయిదా ప‌డింద‌నే వార్త‌ల‌ను ఆయ‌న ఖండించాడు. నిర్ణీత ముహూర్తానికే త‌న పెళ్లి జ‌రుగుతుంద‌ని నిఖిల్ స్ప‌ష్టం చేశాడు. భీమ‌వ‌రానికి చెందిన వైద్యురాలు డాక్ట‌ర్ ప‌ల్ల‌విని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త నెల‌లో వారి నిశ్చితార్థం జ‌రిగింది.

ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే క‌రోనా వ్యాప్తి చెంద‌డాన్ని దృష్టిలో పెట్టుకుని నిఖిల్ పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై నిఖిల్ సీరియ‌స్‌గా స్పందించాడు. “నా  పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం” అంటూ స్పష్టం చేశాడు. అంతే కాదు తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయ‌న సూచించాడు.  

“ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్న నేపథ్యంలో ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదు” అని అత‌ను తేల్చి చెప్పాడు. మొత్తానికి పెళ్లి చేసుకోకుండా ఇక ఆగ‌లేన‌ని నిఖిల్ చెబుతున్నాడ‌న్న మాట‌. క‌ల్యాణం వ‌చ్చినా, కక్కు వ‌చ్చినా ఆగ‌వ‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు క‌దా!

అసెంబ్లీలో కేటీఆర్ అదిరిపోయే స్పీచ్