నేను రెడీ.. కానీ షూటింగ్స్ మాత్రం ఉండవు

తనకు 60 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ 16 ఏళ్ల కుర్రాడినే అంటున్నారు బాలయ్య. కాబట్టి కరోనా ఉన్నా తననేం చేయదని.. షూటింగ్స్ కు తను రెడీ అని ప్రకటించుకున్నారు. అయితే తను సిద్ధమైనా, ఇప్పట్లో…

తనకు 60 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ 16 ఏళ్ల కుర్రాడినే అంటున్నారు బాలయ్య. కాబట్టి కరోనా ఉన్నా తననేం చేయదని.. షూటింగ్స్ కు తను రెడీ అని ప్రకటించుకున్నారు. అయితే తను సిద్ధమైనా, ఇప్పట్లో షూటింగ్స్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు బాలయ్య.

“నేను రెడీ.. వంద మందితోనైనా షూటింగ్ కు రెడీ. ముహూర్తం చూసుకొని ఇంటి నుంచి బయల్దేరుతా. నా నమ్మకాలు నావి. కానీ ఇండస్ట్రీలో భౌతిక దూరం పాటించడం కష్టం. కాబట్టి షూటింగ్స్ చేయడం కొంచెం రిస్క్. లేనిపోని కరోనా తెచ్చుకొని కష్టాలు పడడం ఎందుకు. నేను అనుకోవడం షూటింగ్స్ మొదలవ్వడానికి మరో 3-4 నెలలైనా పడుతుంది.”

ఓవైపు మహేష్, బన్నీ లాంటి హీరోలు తమ సినిమాల షూటింగ్స్ ను వాయిదా వేసుకుంటుంటే.. బాలయ్య మాత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ పై మాట్లాడుతూ.. “ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ నర్మగర్బంగా వ్యాఖ్యానించారు. 

విశాఖకు పరిశ్రమను తరలించే ప్రయత్నాలు చాన్నాళ్లుగా జరుగుతున్నాయన్న బాలయ్య.. ఇండస్ట్రీ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైజాగ్ లో తను చేసినన్ని షూటింగ్స్ ఏ హీరో చేయలేదని.. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అయినప్పటికీ పరిశ్రమ మాత్రం విశాఖకు వచ్చే ఛాన్సులు తక్కువగానే ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు.

ఓవైపు షష్టిపూర్తి చేసుకుంటున్న తను జీవితంలో కొత్తగా లక్ష్యాలంటూ పెట్టుకోనన్నారు. తను ఎప్పుడూ అలా లక్ష్యంతో పనిచేయలేదన్నారు. ఇప్పుడు 60 ఏళ్లు కాబట్టి, మరో 60 ఏళ్ల జీవితం ఉందని.. సినిమాలు చేస్తూనే ఉంటానని స్పష్టంచేశారు బాలయ్య.

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత