పూరీ పై ఇడ్లీ పంచ్ లు!

లైగ‌ర్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాకు చేతినిండా ప‌ని క‌ల్పించింది. అటు పూరీ, ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో సేల‌బుల్. త‌న మార్కు వేదాంతం చెప్పి సోష‌ల్ మీడియాలో బోలెడ‌న్ని మీమ్స్ కు…

లైగ‌ర్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాకు చేతినిండా ప‌ని క‌ల్పించింది. అటు పూరీ, ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో సేల‌బుల్. త‌న మార్కు వేదాంతం చెప్పి సోష‌ల్ మీడియాలో బోలెడ‌న్ని మీమ్స్ కు ఆస్కారం ఇచ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇక అర్జున్ రెడ్డి ద‌గ్గ‌ర నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ డైలాగులు, మేన‌రిజ‌మ్స్ మీమ్స్ కు పాపుల‌ర్. మరి వీరిద్ద‌రూ కాంబోలో వ‌చ్చిన సినిమాకు మించి సోష‌ల్ మీడియాకు మ‌సాలా ఏముంటుంది!

అందులోనూ ఆ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రావ‌డం, క్రిటిక్స్ రెచ్చిపోవ‌డం.. జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్ ను అస్స‌లు వ‌ద‌ల‌డం లేదు నెటిజ‌న్లు. ప్ర‌త్యేకించి పూరీ పై ఆయ‌న సినిమాల్లోని సీన్ల‌ను ఉప‌యోగించి పంచ్ లు వేయ‌డం విశేషం. 

పూరీనే వారికి ఆ మేటిరియ‌ల్ అందించాడు! దాదాపు 14 యేళ్ల కింద‌ట పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ హీరోగా వ‌చ్చిన *నేనింతే* సినిమాలో ఇడ్లీ విశ్వ‌నాథ్ అంటూ ఒక డైరెక్ట‌ర్ కేరెక్ట‌ర్ ను పెట్టాడు పూరీ. వేరే ఎవ‌రి పేరో వాడితే ఎందుకు త‌ల‌నొప్పి అన్న‌ట్టుగా.. తన పేరునే కామిక్ గా మార్చి ఇడ్లీ విశ్వ‌నాథ్ పాత్ర‌కు పెట్టుకున్నాడు పూరీ. ఈయ‌న పూరీ అయితే, ఆయ‌న ఇడ్లీ అన‌మాట‌.

మ‌రి మీమ్స్ కు ఇప్పుడు ఇది బాగా క‌నెక్ట్ అయ్యింది. ప్ర‌త్యేకించి త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా గురించి ఇడ్లీ విశ్వ‌నాథ్ థియేట‌ర్ వ‌ద్ద కు వెళ్లిన త‌న అసిస్టెండ్ ర‌వితేజ‌కు ఫోన్ చేసి తెలుసుకునే కామెడీ సీన్ ను లైగ‌ర్ కు అన్వ‌యిస్తున్నారు మీమ్స్ పేజ్ ల వాళ్లు. 

సినిమా టాక్ ఫ‌స్ట్ షో త‌ర్వాత ఎలా ఉందో, మేట్నీ పూర్త‌యితే కానీ అదెంత డిజాస్ట‌రో తెలుస్తుంద‌న్న‌ట్టుగా ర‌వితేజ చెప్పే డైలాగ్ లు, దానికి బ్ర‌హ్మానందం ఇచ్చే ఎక్స్ ప్రెష‌న్ల సీన్ ను క‌ట్ చేసి.. ఇడ్లీ విశ్వ‌నాథ్ పాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ పాత్ర‌ను చూపిస్తున్నారు నెటిజ‌న్లు!

ఇక అదే సీన్లో హీరో ఫ్యాన్ పాత్ర‌లో పూరీ త‌మ్ముడు సాయిరాం శంక‌ర్ క‌నిస్తాడు. ఇడ్లీ బ‌య‌ట క‌నిపిస్తే కుమ్మేస్తామన్నట్టుగా అత‌డి డైలాగులు ఉంటాయి. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ప‌రిస్థితి కూడా అదేనంటూ మీమ్స్ ప‌డుతున్నాయి!