యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఈ సినిమా ఈవారం విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను ..ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా ఆయన కుమార్తె కోడి దివ్య దీప్తి తో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపించింది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అండర్ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని డిస్కస్ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్ కు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈసినిమాను చూసిన వారందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది మన అందరి ఇళ్లలో జరిగే కథలా వుంటుంది.
హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్ కు చాలా బూస్టప్ ఇస్తుంది.ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను
ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను.ఇందులో నాది బాబా భాస్కర్ ల ట్రాక్ చాలా బాగుంటుంది.
నిర్మాత సహకారం వల్లే ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ తో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది.అయన ఇచ్చిన పాటలు, ఆర్ ఆర్ అద్భుతం. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.
గీతా ఆర్ట్స్ లో “వినరో విష్ణు భాగ్యం”, మైత్రి మూవీ మేకర్స్ లో “మీటర్ ” ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది.ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు కిరణ్ అబ్బవరం.