ఇద్దరు హీరోలు..ఒక్కరే హీరోయిన్. హీరోయిన్ కు ఇద్దరూ నచ్చేసారు. మరి డబుల్ భమాకానే కదా. రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా. ఈ సినిమా ట్రయిలర్ వచ్చేసింది.
ఇటు క్రేజీ లవ్ స్టోరీ..అటు టిపికల్ డబుల్ రోల్..ఈ రెండింటి మధ్య మాంచి యాక్షన్..కలిసి ధమాకా ట్రయిలర్ కింద అందించారు. రవితేజ మార్క్ ఫన్ సినిమా వుందని, అదే సమయంలో మాస్ యాక్షన్ వుందని క్లారిటీ ఇచ్చారు.
శ్రీలీల హీరోయిన్ గా యాక్టివ్ గా కనిపించింది. ఒకరు నిరుద్యోగి. నెల రోజుల్లో ఉద్యోగం కావాలి. మరొకరు నెల రోజుల్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యం. పెట్టుకున్నవారు. ఈ ఇధ్దరి మధ్య లింక్ ఏమిటన్నది సినిమా. బెజవాడ ప్రసన్న కాస్త సరదా డైలాగులు బాగానే అందించినట్లు కనిపిస్తోంది. త్రివిక్రమ్ మీ చుట్టమా సర్ అని అనడం, అమ్మ పళ్లు తెమ్మంది అన్న డైలాగు ట్రయిలర్ లో ఆకట్టుకుంటాయి.
ఇప్పటికే బ్లాక్ బస్టరైన, మిలియన్లకు మిలియన్లు వ్యూస్ తెచ్చుకున్న జింతాక సాంగ్ కు ట్రయిలర్ లో ఫ్లేస్ దొరికింది. మొత్తం మీద ఓ మాస్ ఎంటర్ టైనర్ ను నక్కిన త్రినాధరావు..పీపుల్స్ మీడియా కలిసి అందిస్తున్నట్లు కనిపిస్తోంది.