టైమ్ బాగుంటే అన్నీ సవ్యంగా సాగుతాయి. ఏమాత్రం తేడా కొట్టినా, ఏది పట్టుకున్నా షాక్ కొడుతుంది. హీరోయిన్ రష్మిక విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి కెరీర్ పరంగా ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.
మొన్నటికిమొన్న కాంతార విషయంలో కాంట్రవర్సీ ఎదుర్కొంది రష్మిక. ఒక దశలో రష్మికపై కన్నడ చిత్రసీమ నిషేధం విధిస్తుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. తాజాగా ఆ వివాదంపై స్పందించిన రష్మిక, కాంతార సినిమాను తను కాస్త ఆలస్యంగా చూశానని చెబుతూనే, తనపై నిషేధం లాంటివేవీ లేదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇక బాలీవుడ్ లో పాతుకుపోదామని ఆమె చేసిన ప్లాన్స్ కూడా బెడిసికొట్టాయి. ముందుగా ఆమె నుంచి గుడ్ బై అనే సినిమా రిలీజైంది. ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం రెండో సినిమా మిషన్ మజ్నుతోనైనా సక్సెస్ అందుకోవాలని చూసిన రష్మిక ఆశలు ఆవిరయ్యాయి.
థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన మిషన్ మజ్ను సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. దీంతో రెండో సినిమాతో క్రేజ్ అందుకోవాలనుకున్న రష్మిక ఆశలకు బ్రేక్ పడింది. ఇక బాలీవుడ్ లో మూడో ప్రాజెక్టు యానిమల్. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.
బాలీవుడ్ కోసం చాలా సౌత్ ఆఫర్లు వదులుకుంది రష్మిక. అటు బాలీవుడ్ లో క్రేజ్ రాక, ఇటు సౌత్ నుంచి అవకాశాలు తగ్గి ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం వారసుడు సినిమాపైనే ఉంది. విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా హిట్టయితే, సౌత్ లో రష్మిక, తన స్థానాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. ఇక పుష్ప-2 సినిమా కూడా చేతిలో ఉన్నప్పటికీ, అది రిలీజ్ అవ్వడానికి కనీసం ఏడాది పడుతుంది.