ఒక కొత్త ప్రాజెక్ట్ ని అల్లూరి జిల్లాకు ప్రకటించారు. జిల్లాలోని చింతపల్లి కొయ్యూరు మండలాల సరిహద్దులలో ఉన్న ఎర్రవరంలో హైడ్రొ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది జరిగి ఒక రోజు కాలేదు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వద్దు అంటున్నాయి గిరిజన సంఘాలు.
వెంటనే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పవర్ ప్రాజెక్ట్ కి అనుమతి ఇచ్చాయని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మాకొద్దు అంటూ ఈ నెల 17న గూడెం కొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలలో మన్యం బంద్ కి గిరిజన సంఘాలు పిలుపు ఇచ్చాయి.
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తో స్థానికంగా అభివృద్ధి జరుగుతుందని, అలాగే పవర్ ప్రాజెక్ట్ తో అందరికీ మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రా అభివృద్ధికి కూడా కీలకంగా ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. గిరిజన సంఘాలు మాత్రం పవర్ ప్రాజెక్టే వద్దు అంటున్నారు. వారికి ఎలా నచ్చచెప్పి ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తారో చూడాల్సి ఉంది.