ఇది పండగలాంటి సినిమానే – మారుతి

ప్రతి రోజూ పండగే అంటూ సాయి దరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నారు దర్శకుడు మారుతి. ఆయన తన బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించారు. Advertisement తను తీసిన సినిమాలు…

ప్రతి రోజూ పండగే అంటూ సాయి దరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నారు దర్శకుడు మారుతి. ఆయన తన బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించారు.

తను తీసిన సినిమాలు అన్నీ ఒకదానికి మరోటి భిన్నంగా వుండేలా చూసుకుంటూ వస్తున్నానని, కేవలం డైరక్టర్ కావలనే ఆలోచనతో ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలు తీస్తే, డైరక్టర్ గా నిలదొక్కుకోవడం కోసం భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు చేసాను అన్నారు.

తను ప్రేమకథాచిత్రమ్ చేసిన తరువాత ఆ జోనర్ మళ్లీ టచ్ చేయలేదని, కానీ ఆ జోనర్ ఇఫ్పటికీ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారిందని ఆయన అన్నారు.

ఇప్పుడు తొలిసారిగా బతుకే కాదు, మనిషి ఎప్పటికైనా తప్పని చావు కూడా పండగలాంటిదే అన్న చిన్న ఆలోచనతో ప్రతి రోజూ పండగే సినిమా చేస్తున్నానని మారుతి అన్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ సబ్జెక్ట్ ఇది. 

మనిషి పుట్టినప్పుడు సంతోషంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా సంతోష పెడితే మరిన్ని ఎక్కువ రోజులు బ్రతుకుతాడానే విషయాన్ని కాస్త వినోదం జోడించి చెప్పాము. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని అన్నారు. 

ప్రతిరోజు పండగే సినిమాను రాజమండ్రి లో కొన్ని రోజులు షూట్ చేశాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ కథ కోసం పచ్చని పొలాల్లో కీలక సన్నివేషాలు చిత్రీకరించడం జరిగింది. సినిమాలు ఐదు పాటలు ఉన్నాయి. థమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. సత్యరాజ్ గారి నటన సినిమాకు ఆదనవు ఆకర్షణ కానుంది అని ఆయన వివరించారు. 

ప్రతిరోజు పండగే ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి అయిందని, అమెరికాలో ఐదు రోజులు షూట్ చెయ్యాల్సి వుందని, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నామని చెప్పారు.