ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్(ATAI) ఆధ్వర్యములో కమ్మని తెలంగా విందుతో కని వినని విదంగా కనుల పండుగగా జరిగాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మలు తెచ్చిన ప్రతి ఒక్కరికి బంగారు వెండి నాణెములు బహుమతిగా ఇచ్చినారు. ఈ ఉత్సవాలకు ఆస్ట్రేలియా ఎంపీ మరియు అట్టోర్నీ జనరల్ Jill Henessy, Hobsonsbay మేయర్ జానథన్ తోపాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులూ మరియు అన్ని భారతీయ అసోసియేషన్ ప్రతినిధులు హాజరు అయినారు. వచ్చిన ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాన్ని తలపించే సెట్ ను చూసి మైమరచిపోయారు.
ఈ వేడుకలకు హాజరయిన Jill Henessy, జానథన్ తోపాటు అతిధులందరు బతుకమ్మ అడినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిదిగా విచ్చేసిన Jill Henessy మాట్లాడుతూ ఈ బతుకమ్మ వేడుకలు అంతో ఆనందాన్ని ఇచ్చాయని ఇంతగొప్ప వేడుకలు చూడలేదని కొనియాడారు. ఇదే విషయాన్ని ఆవిడ ఫేస్బుక్ ద్వారా కూడా తెలిపారు ఈ పండుగ స్త్రీలను గౌరవించేదని ప్రకృతిని ప్రేమించేదని చెప్పారు. జానథన్ మాట్లడుతూ ఈ పండుగ Hobsonsbay కౌన్సిల్ లో జరగడం ఆనందంగా ఉందన్నారు.
కమ్మని తెలంగాణ వంటకాలు డబల్కా మీట, గవ్వలు, సకినాలు సర్వపిండి రుచులతో ఇండోఆస్ట్రేలియన్స్ ఆనందోత్సాహాలతో, ఆటాపాటలతో అలరించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు అత్తపురం అమరేందర్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ రానున్నతరాల వారికోసం ATAI చేస్తున్న కృషిని వివరించారు మున్ముందు రానున్న సంవస్త్రాలలో ATAI సాంస్కృతిక పరంగా భారతస్ట్రేలియా దేశాల సంబంధాలను పెంపొందిచే విధంగా కృషి చేస్తామని వివరించారు. ఈనాటి ఈ విజయం వెనుక గత ఆరునెలల నుంచి వాలంటీర్స్ అంతో ఎండని కొనియాడారు. ఈ విజయం ATAI ది కాదని ఈ విజయం తెలంగాణదని అభివర్ణించారు.
ATAI సభ్యులు వేసిన గ్రామీణ వాతారణాన్ని తలపించే సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగర్ వరం లైవ్ మ్యూజిక్ తో శ్రోతలను ఉర్రుతలూగించగా యాంకర్ మధులిక మరియు కళ్యాణిలు బతుకమ్మ ఆటలో జోష్ నింపారు. మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిదంగా బతుకమ్మ నవరాత్రులు 9 రోజులు అడగలగడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పినారు. ఈ పండుగ వాతావరణం ఉన్న ఊరిని గుర్తుచేస్తుందని ATAIని అభినందించారు. ATAI కార్యక్రమానికి రావడం అమ్మగారింటికి వచ్చినట్టుందని కొనియాడారు.