మిస్టర్ ఇండియా.. బాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటి. అలాంటి సినిమాలో చిరంజీవి నటిస్తే ఎలా ఉంటుంది. పైగా చిరంజీవి స్టార్ స్టేటస్, ఇమేజ్ కు ఆ సినిమా పెర్ ఫెక్ట్ గా సూటవుతుంది. కానీ ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ నుంచి చిరంజీవి ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కోదండరామిరెడ్డి స్వయంగా వెల్లడిస్తున్నారు.
“చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేశాం. ఆ ప్రాజెక్టుకు శ్రీదేవే నిర్మాత. ఆమె సొంత సినిమా అది. ఒక పాట కూడా చేసి ఆ సినిమా ఆపేశాం.
ఎందుకంటే.. చిరంజీవి-శ్రీదేవి లాంటి పెద్ద స్టార్స్ తో సినిమా చేయాలంటే సబ్జెక్ట్ అదే రేంజ్ లో ఉండాలి. మాకు ఏ కథ నచ్చలేదు. ఓ సబ్జెక్ట్ అనుకొని, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేసి, సాంగ్ కూడా షూట్ చేసి ఆపేశాం.”
అలా ఓ సినిమా ఆగిన తర్వాత.. అదే కాంబినేషన్ లో శ్రీదేవి నిర్మాతగా 'మిస్టర్ ఇండియా' సినిమా చేద్దామనుకున్నారట కోదండరామిరెడ్డి. శ్రీదేవి, శ్రీదేవి తల్లి, చిరంజీవి, కోదండరామిరెడ్డి.. ఇలా అంతా వెళ్లి ఆ సినిమా రషెష్ చూశారట.4 గంటల రషెష్ చూసి కోదండరామిరెడ్డికి బోర్ కొట్టిందట. తెలుగులో ఈ సినిమా వర్కవుట్ అవ్వదని చెప్పేశారట.
అలా చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా చేయాల్సిన సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. ఇప్పుడు తాపీగా ఆ కాంబినేషన్ లో సినిమా చేయనందుకు బాధపడుతున్నారు. మిస్టర్ ఇండియా రీమేక్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.