ప్రభాస్ ఆదిపురుష్ లుక్స్ చాలా వచ్చాయి. సలార్, మారుతి సినిమా లుక్స్ బకాయి వున్నాయి. పవన్ బ్రో లుక్ వచ్చేసింది. ఎన్టీఆర్ దేవర కనిపించేసాడు.
చాన్నాళ్ల కిందటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ చూసాం. ఆ మధ్య పుష్ప బన్నీ కాళికా అవతారం దర్శించాం. ఇక మిగిలింది మహేష్ బాబే. ప్రస్తుతం చేస్తున్న సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక హాసిని నిర్మాణం.
వాస్తవానికి మహేష్ లుక్స్ లో, గెటప్స్ లో పెద్దగా ప్రయోగాలు చేయరు. ఒకటి రెండు సార్లు చేసారు అది కూడా జస్ట్ హెయిర్ స్టయిల్ మాత్రమే. ఇటీవల మహేష్ లుక్ చాలా మారింది. బాగా స్లిమ్ అయ్యారు. దాని ఎఫెక్ట్ ఫేస్ మీద కూడా కనిపించింది. అసలే మంచి కలర్ తో వుండే మహేష్ ఇంకా కలర్ వచ్చారు.
త్రివిక్రమ్ తీస్తున్న సినిమా ఎలాగూ పక్కా ఫ్యామిలీ డ్రామా కనుక పెద్దగా గెటప్ ప్రయోగాలు ఏమీ అవసరం లేదు. ఈ నెలాఖరున సీనియర్ హీరో కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ సినిమా లుక్ రాబోతోంది. మహర్షి సినిమాలో లుక్ కు దగ్గరగా వుంటుందని టాక్ వుంది. చూడాలి మరి ఎలా వుంటుందో?