హీరో రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ శుక్రవారం థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మంచిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురళి పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల నేపధ్యంలో మీడియా సమావేశంలో ముచ్చటించారు వేణు. ఆయన పంచుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
చిత్ర విశేషాలివి.
సినిమాలు చేయకపోవడానికి నిజానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. ఫ్యామిలీ బిజినెస్స్ లు చాలా వున్నాయి. వాటిలో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండా పోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్ మండవ రామారావు ఆన్ డ్యూటీ కథ చెప్పారు. కథ అద్భుతంగా వుంది. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జానర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది.
చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేనుడబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి వుండేది. కానీ రామారావు ఆన్ డ్యూటీలో నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. రామారావు ఆన్ డ్యూటీ తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్ వుంటారు. రామారావు ఆన్ డ్యూటీతో రవితేజతో కాంబినేషన్ కుదిరింది. మొదటి నుండి నేను మల్టీ స్టారర్ కి మొగ్గు చూపేవాడిని. 'చిరునవ్వుతో' లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ వెంటనే హనుమాన్ జంక్షన్ చేశాను. చాలా మంది నటీనటులతో కలసి నటించడం అంటే అదొక పండగ. హనుమాన్ జంక్షన్ కూడా ఒక పండగలా గడిచింది.
త్రివిక్రమ్ సినిమాల్లో నాకు సరిపడే పాత్ర వుంటే ఖచ్చితంగా చెప్తారు. అతడు సినిమాలో సోనూ సూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారు. ఫలానా పాత్రకి వేణు బావుంటాడని అనిపిస్తే తప్పకుండా చెప్తారు.
మంచి ఆహరం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు లేదు. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్ కు దూరంగా వుంటాను. ఇకపై కచ్చితంగా సినిమాలని చేస్తా. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా ద్రుష్టి వుంది.