ఇక్కడి కథలు అక్కడికి

సినిమా తీరు తెన్నులు మారిపోతున్నాయి. అందరూ యువ కథానాయకులే. ఏ హీరో కోసం కథ రెడీ అయినా అది దాదాపుగా అందరికీ సూటయిపోతోంది. చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు. అందుకే ఏ హీరో కోసం…

సినిమా తీరు తెన్నులు మారిపోతున్నాయి. అందరూ యువ కథానాయకులే. ఏ హీరో కోసం కథ రెడీ అయినా అది దాదాపుగా అందరికీ సూటయిపోతోంది. చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు. అందుకే ఏ హీరో కోసం ఏ కథ వెయిట్ చేయడం లేదు. 

ఈ హీరో డేట్లు ఖాళీ లేవంటే మరో హీరో దగ్గరకు వెళ్లిపోతున్నారు. ఈ హీరో పెదవి విరిస్తే మరో హీరోకి వినిపించేస్తున్నారు. అలా చేజార్చుకున్నవీ. అయ్యో అని తరువాత బాధపడినవీ వున్నాయి. సరైన నిర్ణయమే తీసుకున్నాం అని అనుకున్నవీ వున్నాయి.

రవితేజ కోసం రాసుకుని డేట్ లు సెట్ కాక గోపీచంద్ దగ్గరకు వెళ్లిపోయారు డైరక్టర్ మారుతి.

చైతన్య కోసం అని రాసుకుని, డేట్ లు దొరక్క ధనుష్ దగ్గరకు వెళ్లిపోయాడు వెంకీ అట్లూరి.

నాని దగ్గర నుంచి చాలా మందిని ట్రయ్ చేసి ఆఖరికి అల్లరి నరేష్ దగ్గర సెటిల్ అయిపోయాడు కొత్త దర్శకుడు ఒకరు.

సాయి ధరమ్ తో సినిమా చేయాలనుకుని కథ సిద్దం చేయించి సత్య దేవ్ తో స్టార్ట్ చేస్తున్నారు నిర్మాత కృష్ణ.

రవితేజ తో సహా ఎవరెవరినో అనుకుని ఆఖరికి శర్వానంద్ తో మహా సముద్రం చేస్తున్నారు అజయ్ భూపతి. 

వెంకీ తో తీయాల్సిన ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా శర్వాతో రెడీ అవుతోంది. 

ఇవే కాదు ఇంకా చాలా చాలా సినిమాలు చాలా కాంపౌండ్లు తిరుగుతూ, చాలా హీరోల చెవిలో పడుతూ ఆఖరికి ఎక్కడో సెటిల్ అవుతున్నాయి.