Advertisement

Advertisement


Home > Movies - Movie News

తన బయోపిక్ కు తానే సంగీతం

తన బయోపిక్ కు తానే సంగీతం

ప్రపంచంలోనే అరుదైన ఘనతల్లో ఇది కూడా ఒకటి. బయోపిక్ లు ఎలా వస్తుంటాయో అందరికీ తెలుసు. కానీ ఇళయరాజా బయోపిక్ మాత్రం ఓ అరుదైన రికార్డ్ సృష్టించబోతోంది. ఈ బయోపిక్ కు స్వయంగా ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం.

వెయ్యికి పైగా చిత్రాలకు కంపోజర్ గా పనిచేసిన ఇళయరాజా జీవితాన్ని, కెరీర్ ను వెండితెరపైకి తీసుకొచ్చే బాధ్యతను హీరో ధనుష్ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ భూజానికెత్తుకున్నారు. దీనికి సంబంధించి చెన్నైలో పూజాకార్యక్రమాలు జరిగాయి.

ధనుష్, ఇళయరాజా, అరుణ్ తో పాటు కమల్ హాసన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కమల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ బయోపిక్ లో సంగీతానికి ఎనలేని ప్రాధాన్యం ఉందనే సంగతి తెలిసిందే. ఇళయరాజా కంపోజ్ చేసిన ఎన్నో ట్యూన్స్ ను ఇందులో వాడబోతున్నారు. ఆ ట్యూన్స్ వెనక శ్రమను చూపించబోతున్నారు.

ఇలాంటి సినిమాకు మ్యాస్ట్రో తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. అందుకే ఈ బయోపిక్ కోసం ఇళయరాజానే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా కథ-స్క్రీన్ ప్లేలో కూడా పాల్గొన్న ఇళయరాజా.. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కెరీర్ లో తను అనుభవించిన బాధను, పొందిన ఘనతల్ని, అనుభూతులకు తనే సంగీతం అందించబోతున్నారు.

ఇన్నాళ్లు ఈ సినిమాపై పుకార్లు మాత్రమే వినిపించాయి తప్ప, అధికారిక ప్రకటన రాలేదు. ఎట్టకేలకు ఇళయరాజా బయోపిక్ తెరపైకి రాబోతోంది. ఇళయరాజాగా ధనుష్ మరోసారి తనలోని నటుడ్ని ఆవిష్కరించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో హార్మోనియం పెట్టె పట్టుకొని వెనక నుంచి నిల్చొన్న ధనుష్ ఫొటోను విడుదల చేశారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?