చెఫ్ మంత్ర- కామిష్టి స్క్రిప్ట్

ఓన్లీ తెలుగు ఓటిటి అంటూ ఎంటర్ అయింది ఆహా సంస్థ. ఆరంభంలో కొన్ని అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు అందించినా,  ఓటిటి అంటే ఇదే షార్ట్ కట్ అని ఆహా కూడా అనుకుందేమో…

ఓన్లీ తెలుగు ఓటిటి అంటూ ఎంటర్ అయింది ఆహా సంస్థ. ఆరంభంలో కొన్ని అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు అందించినా,  ఓటిటి అంటే ఇదే షార్ట్ కట్ అని ఆహా కూడా అనుకుందేమో అని సరిపెట్టుకున్నారు. ఆ తరువాత తరువాత రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు చేసిన షో లలో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ వన్ బ్లాక్ బస్టర్. తరువాత తరువాత అది కూడా నీరసించింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్లుగా, ఏదో ఒకటి చేస్తూ మార్కెట్ లో నిలబడడానికి కష్టపడుతోంది ఆహా సంస్థ.

ఇలాంటి టైమ్ లో చెఫ్ మంత్ర సీజన్ త్రీ స్టార్ట్ అయింది. బేసిక్ గా ఇదో వంటల ప్రోగ్రామ్. అయితే సినిమా సెలబ్రిటీలను తీసుకురావడం, వాళ్లతో ముచ్చట్లు పెట్టడం, గేమ్స్ ఆడించడం, పనిలో పనిగా ఏదో ఒక వంట చేయించడం ఇదీ కాన్సెప్ట్. సీజన్ త్రీ కి కొణిదెల నీహారిక ప్రెజెంటర్. టీవీలో, యూ ట్యూబ్ లొ, ఇన్ స్టాలో ఆకట్టుకొవాలి అంటే చిట్టి పొట్టి బట్టలే వేసుకోవాలన్నది సోషల్ మీడియా రాజ్యాంగం అనుకోవాలి కనుక, నీహారిక కూడా దాన్నే ఫాలో అవుతున్నారు.

కానీ ఈ షొకి వచ్చే సెలబ్రిటీల కోసం తయరు చేసిన గేమ్ షో స్క్రిప్ట్ మొత్తం డబుల్ మీనింగ్ ల మయం. ఆన్సర్ ల్లో సింగిల్ మీనింగ్ వుంటుంది. క్వశ్చన్, దాని మీద డిస్కషన్ మొత్తం డబుల్ మీనింగ్ నే. ‘నీ డాష్ ను నువ్వు ఎప్పుడైనా ఫొటో తీసుకున్నావా’…’నువ్వు ఎవరితో డాష్ చేస్తావు’ ఇలా డాష్ అనే పేరు పెట్టి, నానా డబుల్ మీనింగ్ హడావుడి.

పైగా ఎవరు రాసారు ఈ స్క్రిప్ట్, పెద్ద కామిష్టిలా వున్నాడు. ఇది ఫ్యామిలీ షో నా, బెడ్ రూమ్ షో నా అంటూ సెటైర్లు. మొత్తం మీద డబుల్ మీనింగ్ డైలాగులతో షో ను క్లిక్ చేసుకోవాలని అనుకుంటున్నట్లుంది ఆహా రైటింగ్ టీమ్.