ఇలియానా సైడ్ బిజినెస్

లవ్ ఫెయిలైంది, సినిమాలు తగ్గాయి.. హాట్ ఫొటోలతో నేను కూడా లైమ్ లైట్ లోనే ఉన్నానంటూ ఇన్ స్టాలో మాత్రమే కనిపిస్తోంది ఇలియానా. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఆమెకు బొత్తిగా కలసి రాలేదు.…

లవ్ ఫెయిలైంది, సినిమాలు తగ్గాయి.. హాట్ ఫొటోలతో నేను కూడా లైమ్ లైట్ లోనే ఉన్నానంటూ ఇన్ స్టాలో మాత్రమే కనిపిస్తోంది ఇలియానా. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఆమెకు బొత్తిగా కలసి రాలేదు. దీంతో ఇలియానా సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది. 

తాను తయారుచేసిన చాక్లొట్ కేక్ వీడియోని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. సూపర్ టేస్టీ అంటూ సందడి చేస్తూ.. తన కెరీర్ మలుపు తిరగబోతోందనే చిన్న హింట్ కూడా ఇచ్చేసింది ఇలియానా. ఇది నాకు ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని భావిస్తున్నానంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసింది.

లాక్ డౌన్ తర్వాత చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. తన పేరుతోటే వీటిని మార్కెట్ చేసుకోవాలని చూస్తోంది. లవ్ లైఫ్ ఫెయిలైన తర్వాత చాన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లింది ఇలియానా. 

ఇన్ స్టా లో తన లవర్ ఆండ్రూ నీబోన్ ఫొటోలన్నీ డిలీట్ చేసింది. లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే సమయంలో సినిమా లైఫ్ ని కూడా పక్కనపెట్టిన ఇలియానా.. ఇప్పుడు కొత్త తరంతో పోటీ పడలేకపోతోంది.

ఇటు ఆమెకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని కూడా కాదనుకోవడం ఇలియానా చేసిన పెద్ద తప్పు. టాలీవుడ్ లో ఉండి ఉంటే, కనీసం సీనియర్ హీరోలతో అయినా రిపీటెడ్ గా సినిమా అవకాశాలు వచ్చేవి. ఇప్పుడెలాగూ సమయం మించి పోయింది కాబట్టి.. తీరిగ్గా సైడ్ బిజినెస్ గురించి ఆలోచించి బేకరీ ప్లాన్ వేసింది ఇల్లీ బేబీ.

ఇలియానాకు ఇప్పటికే డిజైనరీ గార్మెంట్స్ బొటిక్ ఉంది. ముంబయి, హైదరాబాద్ లో దానికి బ్రాంచీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో కొత్త బిజనెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.