ఇంద్రగంటి…వి…వచ్చేసాడు

పక్కా వైవిధ్యం వున్న సినిమాలు మాత్రమే కాదు, సినిమాకు సినిమాకు ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తూ సినిమాలు చేసే డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. అవార్డు సినిమాతో స్టార్ట్ చేసి, క్లాస్ ఫన్ జోనర్ లో…

పక్కా వైవిధ్యం వున్న సినిమాలు మాత్రమే కాదు, సినిమాకు సినిమాకు ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తూ సినిమాలు చేసే డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. అవార్డు సినిమాతో స్టార్ట్ చేసి, క్లాస్ ఫన్ జోనర్ లో అడుగుపెట్టి, రకరకాల సినిమాలు చేస్తూ, ఇప్పుడు తొలిసారి థ్రిల్లర్ లైన్ లోకి వచ్చారు ఇంద్రగంటి. అంతే కాదు నాని-సుధీర్ బాబులతో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారు.

ఏప్రియల్ లో విడుదల కాబోయే ఈసినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. అఫీషియల్ గా 'వి' అనే టైటిల్ కూడా రివీల్ చేసారు. ఈ సినిమాలో నాని విలన్ గా, సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడని ఇఫ్పటికే గ్యాసిప్ లు వచ్చాయి. నాని లుక్ ను కూడా ఒక రోజు ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. ముందుగా సుధీర్ బాబు లుక్ ను విడుదల చేసారు.

తీక్షణంగా చూస్తూ, గన్ ను గురిపెట్టిన సుధీర్ బాబు లుక్, వి టైటిల్ లోగో డిజైన్ అన్నీ కలిసి సినిమా జోనర్ ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. అంత మాత్రం చేత ఇంద్రగంటి సినిమా ఇలా వుంటుంది అని చెప్పేయలేం. ఎందుకంటే ఆయన సినిమాల నడక వేరుగా వుంటుంది. అది సినిమా చూసాక కానీ తెలియదు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు అమిత్ త్రివేదీ సంగీతం అందిస్తున్నారు.