Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాని చెప్పిన ఆ 2 సినిమాలు.. ఆసక్తికర చర్చ

నాని చెప్పిన ఆ 2 సినిమాలు.. ఆసక్తికర చర్చ

కష్టపడడం వరకు మాత్రమే మన చేతిలో ఉంటుంది. హిట్టవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయం మన చేతిలో ఉండదంటున్నాడు నాని. ఇది అందరూ చెప్పే విషయమే. అయితే ఆ తర్వాత అతడు చెప్పిన సంగతులే సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఇంతకీ నాని ఏమన్నాడంటే..

"సక్సెస్ అనేది ఓవర్-రేటెడ్. ఉదాహరణకు నా సినిమాల్నే తీసుకుంటే, ఓ సినిమా విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నాను, చాలా కష్టపడ్డాను కూడా. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. నేను నటించిన మరో సినిమాపై నాకు అంతగా అంచనాల్లేవ్. యావరేజ్ గా ఆడుతుందనుకున్నాను, కానీ అది పెద్ద హిట్టయింది."

ఇది నాని తాజా స్టేట్ మెంట్. దీంతో ఆ రెండు సినిమాలు ఏంటనే చర్చ ఊపందుకుంది. ఫస్ట్ కేస్ లో నాని చెప్పిన విషయానికి, 'అంటే సుందరానికి' సినిమాకు లింక్ పెడుతున్నారు నెటిజన్లు. ఆ సినిమా రిలీజ్ టైమ్ లో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, కానీ రిజల్ట్ తేడా కొట్టిందని అంటున్నారు. మరికొందరు మాత్రం జెర్సీ సినిమా పేరు ప్రస్తావిస్తున్నారు.

ఇక రెండో కేసు విషయానికొస్తే.. ఎక్కువమంది ఎంసీఏ సినిమాను చెబుతున్నారు. ఆ సినిమా యావరేజ్ గా ఆడుతుందని నాని భావించి ఉండొచ్చని, కానీ అది పెద్ద హిట్టయిందని చెబుతున్నారు.

మొత్తమ్మీద నాని ఇచ్చిన స్టేట్ మెంట్స్ తో అంటే సుందరానికి, ఎంసీఏ సినిమాలు మరోసారి చర్చకొచ్చాయి. తన కొత్త సినిమా దసరా ప్రమోషన్స్ లో భాగంగా, బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ నాని ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?