యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. ఈ వారం ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు
2012 అంటే గుర్తుకు వచ్చేది యుగాంతమే. అప్పట్లో నేను కాలేజీలో ఉన్నాను. వార్తల్లో, చర్చల్లో యుగాంతం అని ఎక్కువ వినిపించింది. హాలీవుడ్ సినిమాలు కూడా రెండు మూడు వచ్చాయి. అవి చూశా. అప్పుడు స్టూడెంట్ ను. ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగింది. అప్పుడు జీవితం అంతా తెలుసు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమీ తెలియదని అర్థమైంది.
అజయ్ భూపతి ద్వారా దర్శకుడు క్లాక్స్ నాకు పరిచయం అయ్యారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర వాళ్ళిద్దరూ కొలీగ్స్. కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా.
నిజం చెప్పాలంటే… ఈ కథ విన్నప్పుడు నాకు విజువల్ ఏమీ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్… కమర్షియల్ కథ విన్నప్పుడు అంతకు ముందు సినిమాల్లో విజువల్స్ ఫ్లాష్ అవుతాయి. సీన్స్ కొన్ని గుర్తు వస్తాయి. 'బెదురులంక 2012' కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి.
సినిమా స్టార్ట్ చేసినప్పుడు భయపడ్డాం. నేహా శెట్టి మంచి నటి. 'డీజే టిల్లు'లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో… సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం.
'ఆర్ఎక్స్ 100'లో నా క్యారెక్టర్ శివ, గోదావరి నేపథ్యంలో కథ! 'బెదురులంక 2012'లోనూ నా పాత్ర పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా! ఇదంతా యాదృశ్చికంగా జరిగింది. కథ నచ్చి రెండు సినిమాలు చేశా.
మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్‌కోర్స్… సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే… ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు.
అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. సరైన కథ కుదరాలి. కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం. అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తాం.