జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ అందిస్తున్న రెండో సినిమా ప్రిన్స్. శివకార్తికేయన్ నటిస్తున్న ఈ సినిమా తెలుగు..తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఆసియన్ సునీల్ నిర్మించిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఇప్పటి వరకు సినిమా కథేంటీ అన్నది బయటకు రాలేదు. తొలిసారిగా ట్రయిలర్ లో టోటల్ కథ రివీల్ అయింది.
కులం..మతం అంటూ సదా కొట్టుకునే ఊళ్లో స్కూలు టీచర్ గా హీరో కనిపించాడు. అదే స్కూలుకు వచ్చిన విదేశీ అమ్మాయిని ప్రేమించేస్తాడు. అసలే కులం..మతం అని కొట్టుకునే ఊరు ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారం అన్నట్లు అయిపోయింది. భారతీయులు అంతా సోదరీ సోదరీమణులు కనుకే విదేశీ అమ్మాయిని ప్రేమించాననేది హీరో లాజిక్.
ఇలా మొత్తం మీద మరీ జాతిరత్నాలు రేంజ్ ఫన్ కాదు కానీ, హీరో క్యారెక్టర్ మాత్రం కాస్త పాలిష్డ్ జాతిరత్నంలాగే వుంది. శివకార్తికేయన్ తన స్టయిల్ కామెడీ టైమింగ్ తో కనిపించాడు. హీరోయిన్ మారియా ఫ్రెష్ ఫీల్ ఇచ్చేలా కనిపించింది.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ…థమన్ సంగీతం ట్రయిలర్ కు ప్లస్ అయ్యాయి.