సరదా సీన్ నే కావచ్చు. కానీ అదుర్స్ సినిమాలో చారి పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన జోస్యమే నిజమైంది. హీరోయిన్ నయన తార కు ట్విన్స్ పుట్టారు.
నాలుగైదు నెలల క్రితం నయనతార, విఘ్నేష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి కవల పిల్లలు పుట్టారు. ఈ శుభ విశేషాన్ని విఘ్నేష్ నే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
అదుర్స్ సినిమాలో స్విమింగ్ పూల్ సీన్ లో చారి పాత్రలో ఎన్టీఆర్ జోస్యం చెబుతాడు. ‘మీకు కవల పిల్లలు పుడతారండీ’ అంటూ. అది సరదా సీన్ నే అయినా ఇప్పుడు అదే నిజమైంది.
కానీ గమ్మత్తేమిటంటే సోషల్ మీడియా జనాలకు మాత్రం ఇదంతా ఆశ్చర్యమే. పెళ్లై నాలుగు అయిదు నెలలు కాలేదు. అప్పుడే డెలివరీనా? అంటూ రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
కవల పిల్లలు ఇద్దరూ మగపిల్లలే కావడం విశేషం. పెద్దల ఆశీర్వాదం, అందరి అభిమనాలు కలిసి తమ కోర్కె ఫలించిందని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు.
నయన్ లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్ హిట్ కావడం, ఇప్పుడు ఇద్దరు మగ బిడ్డలు కలగడం అన్నీ మంచి శకునములే.