ఇంట్రస్టింగ్..మోసగాళ్లు

సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తూ, సినిమాలు చేస్తూ వస్తున్న హీరో మంచు విష్ణు. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్, ఫన్ ఇలా అన్నీ ట్రయ్ చేసాడు. కానీ తొలిసారి ఓ ఇంట్రస్టింగ్…

సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తూ, సినిమాలు చేస్తూ వస్తున్న హీరో మంచు విష్ణు. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్, ఫన్ ఇలా అన్నీ ట్రయ్ చేసాడు. కానీ తొలిసారి ఓ ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది మోసగాళ్లు ట్రయిలర్ చూస్తుంటే.

సైబర్ టెక్నాలజీ, పూర్-రిచ్ గ్యాప్, యువతరం ఆశలు కోర్కెలు, ఇలాంటి అనేక కాంటెంపరరీ ఇస్యూల నేపథ్యంలో మోసగాళ్లు స్టోరీ తయారుచేసుకున్నట్లు కనిపిస్తోంది. రియల్ స్కామ్ ఆధారంగా అని ప్రకటించారు అది వేరే సంగతి.

సరైన అవకాశం రాని యంగస్టర్స్ తమ తెలివిని పక్కదారి పట్టిస్తే అన్న ఐడియాతో స్కామ్ స్టోరీ సాగింది. ట్రయిలర్ ఇంట్రస్టింగ్ గా కట్ చేసారు. కాజల్, నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించారు. 'లక్ష్మీదేవి ఎందుకు అంత రిచ్ నో తెలుసా…నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి' అనే మాంచి డైలాగు ఒకటి వినిపించింది ట్రయిలర్ లో. 

ట్రయిలర్ లో వున్న మేటర్, మీటర్ పక్కగా సినిమాలో కూడా వుంటే మంచి హిట్ కోట్టాలనే మంచు విష్ణు కోరక తీరుతుందేమో?