పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి, కోరికల్ని రగల్చడానికి వయాగ్రా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ విషయంలో మహిళల కోసం జరుగుతున్న ప్రయోగాలు, వచ్చిన ఆవిష్కరణలు అంతగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు మహిళల కోసం సరికొత్త వయాగ్రాను తయారుచేశారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. ఇదొక నాజల్ స్ప్రే.
దీన్ని మహిళలు ముక్కులో స్ప్రే చేసుకుంటే చాలు, మూడ్ దానంతట అదే వస్తుంది. పడక గదిలో స్వర్గాన్ని అందుకోవచ్చని చెబుతున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మెనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజేన్ డావిస్. లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ స్ప్రే అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ స్టడీ ప్రకారం.. 30 ఏళ్ల లోపు వయసున్న మహిళల్లో ప్రతి 10 మందిలో ఒకరు శృంగార కోరికలు తగ్గి బాధపడుతున్నారు. పని ఒత్తిడి, పరిసరాల ప్రభావం వల్ల.. శారీరకంగా ఫిట్ గా ఉన్నప్పటికీ సెక్స్ పై వీళ్లు ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు. ఇక 40 ఏళ్లు దాటిన మహిళల్లో శృంగారంపై అనాసక్తి మరింత ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వాళ్లకు ఈ స్ప్రే చక్కగా పనికొస్తుందని చెబుతున్నారు.
అయితే ఇది వయాగ్రా కంటే ఎంతో భిన్నమైనది. ఈ స్ప్రేలో BP1010 అనే మాలిక్యూల్ ఉంటుంది. ఇది ముక్కు ద్వారా ప్రయాణించి మెదడుకు చేరుకుంటుంది. బ్రెయిన్ లో సెక్స్ కు సంబంధించిన ఆలోచనల్ని ఇది ప్రేరేపిస్తుంది. తద్వారా శృంగారంలో పాల్గొనాలనే కోరికను మహిళలల్లో రేకెత్తిస్తుంది.
ఈ స్ప్రేను ఇప్పటికే కొంతమంది మహిళలపై పరీక్షించి మంచి ఫలితాలు రాబట్టారు. మరిన్ని ప్రయోగాల కోసం 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తే, మహిళలకు సంబంధించిన లైంగిక అనాసక్తి సమస్యకు పూర్తి పరిష్కారం దొరికినట్టేనని చెబుతున్నారు.