Advertisement

Advertisement


Home > Movies - Movie News

మారేడుమిల్లి షెడ్యూల్ కు బన్నీ సిద్ధమా?

మారేడుమిల్లి షెడ్యూల్ కు బన్నీ సిద్ధమా?

పుష్ప-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొన్నటికిమొన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఫహాద్ ఫాజిల్ పై ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. సినిమాకు సంబంధించి దాన్ని కీలకమైన షెడ్యూల్ గా చెప్పుకొచ్చింది యూనిట్. ఆ తర్వాత రామోజీ ఫిలింసిటీలో కూడా మరో చిన్న షెడ్యూల్ పూర్తిచేశారు.

ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న యూనిట్, ఇప్పుడు మరో పెద్ద షెడ్యూల్ కు రెడీ అవుతోంది. మారేడుమిల్లిలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈసారి అల్లు అర్జున్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. రష్మిక కూడా వస్తోంది. వీళ్లిద్దరితో ఓ షెడ్యూల్ పూర్తిచేయడానికి అంతా రెడీ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.

అయితే ఈ షెడ్యూల్ కు పుష్పరాజ్ సిద్ధంగా ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రీసెంట్ గా అహా యాప్ లో ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు బన్నీ. ఆ కార్యక్రమంలో కాస్త ట్రిమ్ చేసిన గడ్డంతో కనిపించాడు. అది పుష్పరాజ్ గెటప్ మాత్రం కాదు. దీంతో మారేడుమిల్లి షెడ్యూల్ కు అల్లు అర్జున్ ఎలా తయారవుతాడనేది ఆసక్తికరంగా మారింది.

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా హిట్టవ్వడంతో, పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడట సుకుమార్. కథ పరంగా సినిమాలో కొంత పోర్షన్ ను విదేశాల్లో కూడా చిత్రీకరిస్తారనే టాక్ నడుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?