Advertisement

Advertisement


Home > Movies - Movie News

అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు

అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు

అక్కినేని ఫ్యామిలీ హీరోలు ముగ్గురూ ఫ్లాపులు ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని కొత్త సినిమాల దిశగా ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ముందుగా తండ్రి హీరో నాగార్జున కొత్త సినిమా జూన్ రెండో వారంలో పూజ జరుపుకోబోతోంది. 

రచయిత బెజవాడ ప్రసన్న ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. కస్టడీ సినిమాను నిర్మించిన చిట్టూరి శ్రీను ఈ సినిమాను నిర్మిస్తారు. ఓ మలయాళ సినిమా నుంచి పాయింట్ తీసుకుని సినిమాను నిర్మించబోతున్నారు. జూన్ రెండవవారంలో పూజ నిర్వహించి జూలై ఫస్ట్ వీక నుంచి షూటింగ్ కు వెళ్తారు.

నాగ్ చైతన్య కథల కోసం వెదుకుతున్నారు. వరుసగా కథలు వినే పనిలో వున్నారు. కథ, దర్శకుడు సెట్ అయితే త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ వుంటుంది. 

ఒక్క సినిమా అయినా కాస్త మంచి సినిమా చేసారు, క్రాఫ్ట్ బాగా చూపించారు అనే పేరున్న దర్శకులు ఎవరితో అయినా వర్క్ చేయడానికి చైతూ రెడీగా వున్నారు. ఇలాంటి దర్శకుడు తమ రెండో సినిమా కోసం కథను చైతూ కోసం రెడీ చేసారు. ఓ ఫెయిల్యూర్ క్యారెక్టర్ లాంటి దాన్ని లీడ్ తీసుకుని ఈ కథ రాసారు. అది ఓకె అయితే సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది.

యువి నిర్మించే సినిమాలో నటించబోతున్నారు అక్కినేని అఖిల్. ప్రస్తుతం యువి సంస్థ ఆదిపురుష్ విడుదల హ‌డావుడిలో వుంది. దాంతో పాటే మిస్ శెట్టి..మిస్టర్ శెట్టి సినిమా కూడా విడుదల చేయాలి. 

ఓ పక్క ఈ సినిమాల విడుదల పనులు చూసుకుంటూనే, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చూస్తున్నారు. కాస్త భారీగా ఖర్చయ్యే సినిమానే అఖిల్ తో చేయబోతున్నారు. కొత్త దర్శకుడితో పని చేయడానికి అఖిల్ రెడీ అవుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?