హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ నిజమేనా?

ఈ మధ్య ఓ ఈవెంట్ లో మృణాల్ ప్రేమలో పడాలని, వీలైతే తెలుగింటి కోడలు అవ్వాలని ఆశీర్వదించారు నిర్మాత అల్లు అరవింద్. ఆ ఆశీర్వాద ఫలితమో ఏమో కానీ, కొన్ని రోజుల్లోనే మృణాల్ పై…

ఈ మధ్య ఓ ఈవెంట్ లో మృణాల్ ప్రేమలో పడాలని, వీలైతే తెలుగింటి కోడలు అవ్వాలని ఆశీర్వదించారు నిర్మాత అల్లు అరవింద్. ఆ ఆశీర్వాద ఫలితమో ఏమో కానీ, కొన్ని రోజుల్లోనే మృణాల్ పై డేటింగ్ రూమర్స్ గుప్పుమన్నాయి. అయితే తెలుగు కుర్రాడితో కాదు, సింగర్ బాద్షాతో.

31 ఏళ్ల మృణాల్, బాద్షాతో డేటింగ్ చేస్తోందంటూ కథనాలు మొదలయ్యాయి. దీనికి కారణం శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళి పార్టీకి వీళ్లిద్దరూ కలిసి హాజరవ్వడమే. కలిసి హాజరైతే పర్వాలేదు, చేతిలో చేయి వేసుకొని నడవడం, మీడియా ముందు స్మైల్ ఇవ్వడం ఊహాగానాలకు తావిచ్చింది.

24 గంటలుగా నడుస్తున్న ఈ రూమర్లను చూసీచూడనట్టు వదిలేసింది మృణాల్ ఠాకూర్. అయితే సింగర్ బాద్షా మాత్రం రియాక్ట్ అయ్యాడు. మృణాల్ తో డేటింగ్ అంటూ వస్తున్న కథనాల్ని అతడు ఖండించాడు. “డియర్ ఇంటర్నెట్, మరోసారి నిరాశపరిచినందుకు సారీ. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, అది అలాంటిది కాదు.” అంటూ పరోక్షంగా ఈ వార్తల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు.

మృణాల్-బాద్షా రెండేళ్లుగా బాగా క్లోజ్. బాద్షాకు చెందిన ఓ మ్యూజిక్ వీడియోలో మృణాల్ నటించింది. అప్పట్నుంచి వీళ్లిద్దరూ టచ్ లోనే ఉన్నారు. ఈ గ్యాప్ లో తెలుగులో పాపులర్ అయింది మృణాల్. అయినప్పటికీ బాద్షాతో టచ్ లోనే ఉంది. తాజాగా జరిగిన పార్టీకి కూడా అతడితో కలిసి వెళ్లింది. అయితే ప్రేమ-డేటింగ్ లాంటివేం లేవంటూ కొట్టిపారేస్తున్నాడు సదరు సింగర్.