గుంటూరుకారం సినిమా తర్వాత ఉన్నఫలంగా శ్రీలీల ఖాళీ అయిపోయింది. చేతిలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ కంటిన్యూ చేద్దామంటే ఆ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. పోనీ కొత్త సినిమాలు స్టార్ట్ చేద్దామంటే ఇంకా మొదలవ్వలేదు. దీంతో ఊహించని విధంగా ఖాళీ అయిపోయింది ఈ అందగెత్త.
మరి ఈ గ్యాప్ లో శ్రీలీల ఏం చేస్తోంది? ఆమె ఏం చేస్తోందనే విషయాన్ని పక్కనపెడితే, ఈ గ్యాప్ లో ఆమె లావెక్కిందనే చర్చ మాత్రం మొదలైంది. దీనికి కారణం తాజాగా బయటకొచ్చిన ఆమె ఫొటోలు.
రవితేజ 75వ చిత్రం ఈరోజు లాంఛ్ అయింది. శ్రీలీల ఇందులో హీరోయిన్. ధమాకా మేజిక్ రిపీట్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. ఈ మూవీ ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీలీల లావుగా కనిపించింది. దీంతో కొత్త చర్చ మొదలైంది.
ఆమె చీరకట్టులో ఉండడం వల్లనే అలా లావుగా కనిపించిందని కొందరు అంటుంటే, నిజంగానే లావెక్కిందని, ఆమె భుజాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పని లేకపోతే లావెక్కడం సహజమే అని మరికొందరు సమర్థిస్తున్నారు. ఇంతకీ శ్రీలీల నిజంగానే లావెక్కిందా.. లేక చీరకట్టు వల్ల అలా కనిపించిందా..?
షార్ట్ గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ బిజీ అయింది. రవితేజ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచే మొదలైంది. అటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వచ్చేలా ఉంది. ఈ మూవీస్ తో పాటు మరో 2 సినిమాలు కూడా ఆమె ప్రకటించబోతోంది.