Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ హీరోయిన్ జీవితంలో సినిమాకు మించిన క‌ష్టాలు

ఆ హీరోయిన్ జీవితంలో సినిమాకు మించిన క‌ష్టాలు

హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ జీవితంలో సినిమాకు మించిన క‌ష్టాలున్నాయి. ఒక‌ట్రెండు కాదు..ఎన్నెన్నో విషాద ఘ‌ట‌న‌లు. జీవితంలో లైంగిక వేధింపులు, కుటుంబ స‌మ‌స్య‌లు, ర‌క్త సంబంధీకుల‌ను అర్ధాంత‌రంగా కోల్పోవ‌డం...ఇలా ఎన్నో బాధ‌లు. ఈ ఐశ్వర్యా రాజేశ్‌కు తెలుగు స‌మాజానికి ఎలాంటి సంబంధ‌మో ముందు తెలుసుకుందాం. ఆ త‌ర్వాత మిగిలిన‌వ‌న్నీ.

ఒక‌ప్ప‌టి హీరో, న‌టుడు అయిన రాజేశ్ కుమార్తే ఐశ్వ‌ర్యా రాజేశ్‌. అంతేకాదు, హాస్య‌న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు కూడా. ఎనిమిదేళ్ల వ‌య‌స్సులో తండ్రిని కోల్పోయిన ఐశ్వ‌ర్యా జీవితంలో ఎత్తుప‌ల్లాల‌న్నీ చూసింది. నేడు హీరోయిన్ స్థాయికి ఎద‌గ‌డం వెనుక ఆమె క‌ఠోర శ్ర‌మ, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై ప్రేమ దాగి ఉన్నాయి. ఇటీవ‌ల‌  ‘టెడ్‌ఎక్స్‌ టాక్‌ షో’లో ఆమె ప్ర‌సంగం ప్ర‌తి ఒక్క‌రికీ క‌న్నీళ్లు తెప్పించింది. అలాగే జీవితంలో ఓ గొప్ప స్ఫూర్తిని ర‌గిల్చే జీవ‌న పోరాటాన్ని ఆవిష్క‌రించారామె.

‘ప్రజలు ‘మురికివాడ’గా పిలిచే ప్రదేశం నుంచి వచ్చా. మాది  దిగువ మధ్య తరగతి కుటుంబం. హౌసింగ్‌ బోర్డ్‌ అపార్ట్‌మెంట్‌లో అమ్మ, నాన్న, ముగ్గురు సోదరులు, నేను ఉండేవాళ్లం. నాకు 8 ఏళ్ల వయసులో క‌ష్టాలంటే ఏంటో మొద‌ట తెలిసి వ‌చ్చాయి. ఎందుకంటే అంత చిన్న వ‌య‌సులో నాన్నను శాశ్వ‌తంగా కోల్పోయాను. అయితే నాన్న లేని  లోటు తెలియ కుండా మమ్మల్ని అమ్మ పెంచింది. తను చాలా స్ట్రాంగ్‌, బోల్డ్’ అని చెప్పుకొచ్చింది.  ప్ర‌తి విష‌యాన్ని సినిమా క‌థ మాదిరిగానే ఆమె ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చింది. ఇంకా ఏం చెప్పారంటే...

‘నాకు 11, 12 ఏళ్లు ఉన్నప్పుడు పెద్దన్నను కోల్పోయాం. తర్వాత ఏడాది, ఏడాదిన్నరకు మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పోగొట్టుకున్న త‌ల్లి క‌డుపు బాధ‌ను చెప్ప‌డానికి మాట‌లు రావ‌డం లేదు. ఆ దుఃఖాన్ని త‌ట్టుకోవ‌డం వ‌ల్ల కాలేదు. కుటుంబానికి అండగా ఎవరూ లేరు. అప్పుడు మాలో తెలియ‌ని భ‌యం’ అని కుటుంబ క‌ష్టాల‌ను ఆమె ఏక‌రువు పెట్టారు. త‌ర్వాత సినీ ప్ర‌స్తానం గురించి ఆమె ఏం చెప్పారో తెలుసుకుందాం.

‘తర్వాత నాకు సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది. కానీ, చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. అమ్మ స‌ల‌హాతో  సిని మాల్లో  ప్రయత్నించా.  ప్చ్‌...నిరాశ ఎదురైంది. శరీర ఛాయను సాకుగా చూపించి అవకాశాలు ఇవ్వలేదు. కొందరు దర్శకులు హాస్యనటులకు జంటగా నటించాల‌ని అడిగారు. అవి వద్దనుకున్నా. మంచి పాత్రల్లో నటించాలనేది నా కల. ‘అట్టకత్తి’లో చిన్న పాత్ర చేశా. ప్రేక్షకులకు నా నటన నచ్చింది.  తర్వాత ‘కాకా ముట్టై’ నా కెరీర్‌ను మార్చింది. నిజాయతీగా చెబుతున్నా, నమ్మండి... నన్నెవరూ నమ్మలేదు.  నాకు నేనే అండగా నిలిచా. నన్ను నేను నమ్మాను. లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొన్నా. అన్నిటిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డా. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని ఐశ్వ‌ర్యా రాజేశ్ చెప్పుకొచ్చారు.

ఓ మ‌నిషి జీవితంలో ఇంత‌కంటే క‌ష్టాలు ఏముంటాయి? త‌ండ్రి, సోద‌రుల‌ను కోల్పోయిన ఆ స‌మ‌యాన భ‌విష్య‌త్‌పై ఆశ‌లు స‌న్న‌గిల్లి జీవిత‌మంటే భ‌య‌ప‌డ‌డం స‌హ‌జ‌మే క‌దా! కానీ క‌ష్టాల‌న్నిటిని ఎదుర్కొని ధైర్యంగా పోరాటం చేయ‌డం వ‌ల్లే ఈ వేళ ఐశ్వ‌ర్యా రాజేశ్ త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 

‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం అధ్యక్షతన మొదటి సదస్సు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?