Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫొటోగ్రాఫ‌ర్‌ను పెండ్లాడిన సుమ‌న‌

ఫొటోగ్రాఫ‌ర్‌ను పెండ్లాడిన సుమ‌న‌

చిర‌కాల మిత్రుడైన ఫొటోగ్రాఫ‌ర్ శ్రీ‌నివాస్‌ను క‌న్న‌డ సినిమా ద‌ర్శ‌కురాలు, నిర్మాత అయిన సుమ‌న పెండ్లి చేసుకున్నారు. వీరి వివాహం గ‌త నెల 17నే జ‌రిగినట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు మాత్రం తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

దీంతో సుమ‌న అభిమానులు ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నారు. స్ల‌మ్ బాలా, కిరియురినా గ‌యాలిగ‌లు, ఎడెగారికా త‌దిత‌ర సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. ‘ఆ దినగలు’ చిత్రంతో అసోసియేట్ డైరెక్టర్, గేయ రచయితగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన సుమ‌న క్ర‌మంగా త‌న ప్ర‌తిభ‌ను చాటుతూ వ‌చ్చారు.  

కల్లారే సాంటే, ఎడెగారికే చిత్రాలకు రెండు కర్ణాటక రాష్ట్ర అవార్డులను గెలుచుకోవ‌డం ఆమె ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుత కాలంలో ఆధిపత్యం చెలాయించే సామాజిక వ్యతిరేక క‌థా నేప‌థ్యంతో సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం ఆమెకు ఇష్టం.  కొంత కాలంగా కొత్త జంట పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారు.

కాగా షిమోగాలోని ఓ దేవాలయంలో  మూడు ముళ్ల బంధంతో సుమ‌న‌, శ్రీ‌నివాస్ జంట ఒకటైనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం ఈ జంట బెంగళూరుకు మకాం మార్చనున్నారు.  

‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం అధ్యక్షతన మొదటి సదస్సు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?