Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగబాబు గాలి తీసేసిన 'జబర్దస్త్'

నాగబాబు గాలి తీసేసిన 'జబర్దస్త్'

నాగబాబు జబర్దస్త్ ని వదిలిపెట్టారు. బయటికొస్తూ.. ఆ కార్యక్రమం నిర్వాహకులపై పెద్ద బండలే వేశారు. అన్నేళ్లు చేయాల్సింది కాదని, ఇన్నిరోజులు నడుస్తుంది అనుకోలేదని, నాకు మర్యాదిస్తే.. ఇంతదూరం ఎందుకొస్తుందని, తక్కువ రెమ్యునరేషన్ కే పనిచేశానని.. మానవీయ కోణం లేదని... ఇలా చాలా చాలానే అన్నారు. సహజంగా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారే నాయకుడిలా నాగబాబు మాట్లాడారు.

జబర్దస్త్ కి పెద్ద దిక్కులాంటి మెగా బ్రదర్ బైటకు రావడంతో ఆ కార్యక్రమం రేటింగ్ సడన్ గా పడిపోతుందనే ఊహాగానాలు వచ్చాయి. నాగబాబు లేని జబర్దస్త్ షో అంత బిగిగా ఉండదని కూడా కొన్ని విశ్లేషణలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్  అయింది. మూడు వారాలుగా నాగబాబు లేని జబర్దస్త్ ప్రేక్షకులను ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. నిన్న వచ్చిన టీఆర్పీల్లో కూడా జబర్దస్త్ దే హవా.

పైగా నాగబాబు లేకపోవడంతో తమ క్రియేటివిటీకి మరింత పదునుపెట్టారు నిర్వాహకులు. కొత్తగా గెస్ట్ రౌండ్ ని తీసుకొచ్చి, ఆ గెస్ట్ తో హంగామా చేయించడం మొదలు పెట్టారు. తమ సినిమాల ప్రమోషన్ కోసం వచ్చినా, అతిథులుగా వచ్చినా, అనుకోకుండా వచ్చిన హీరోలు సాయి తేజ్, కార్తికేయ.. ఆ షోకి అదనపు ఆకర్షణ అయ్యారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో వస్తున్న అలీ ఎపిసోడ్ లు మరీ అంత ఆకట్టుకోలేకపోయినా.. ఆ షో ఇమేజ్ ని మాత్రం డ్యామేజీ చేయలేదనే చెప్పాలి. 

ఒకరకంగా చూస్తే.. నాగబాబు లేకపోవడం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదు. అటు నాగబాబు బైటకొచ్చి ఏం చేశారంటే సమాధానం లేదు. జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ కి మరీ ఓవర్ హైప్ ఇస్తున్నారు కానీ, ఇమీడియట్ గా సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. అంటే ఇప్పటివరకూ జబర్దస్త్ కు నాగబాబే బలం అనుకున్న కొందరి భ్రమలు పటాపంచలయ్యాయి. ఆయన లేకపోయినా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని తేలిపోయింది. 

జగన్ ఉగ్రరూపం.. నీకు సిగ్గుందా, బుద్ది ఉందా బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?