స్టార్ డమ్ ఎంత ఆనందాన్నిస్తుందో, అంతే బాధను కూడా కలిగిస్తుంది. క్రేజ్ ఉందని సంబర పడేలోపే ట్రోలింగ్స్, బాడీ షేమింగ్స్, మార్ఫింగ్స్ లాంటివి పుట్టుకొచ్చి బాధపెడతాయి. ట్రోలింగ్స్ ను తట్టుకున్నప్పుడే స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయగలమని చెబుతోంది జాన్వి కపూర్.
ఊహ తెలిసిన టైమ్ కే తనపై ట్రోలింగ్స్, బాడీ షేమింగ్స్ మొదలయ్యాయని, వాటిని చూస్తూ, తట్టుకుంటూ పెరిగానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు నుంచే జాన్వి కపూర్, అందర్నీ ఆకర్షించింది. ఆ క్రమంలో 13 ఏళ్లకే ఆమెపై తీసిన కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్ లో పెట్టారంట. వాటిని తన క్లాస్ మేట్స్ చూసి హేళన చేశారని, అప్పట్నుంచే తను రాటుదేలడం మొదలుపెట్టానని తెలిపింది.
తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హీరో రాజ్ కుమార్ రావ్ తో కలిసి కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అందులో మాట్లాడుతూ.. ట్రోలింగ్ ను ఎదుర్కోవడం ఇప్పుడు తనకు చాలా తేలికైందని చెప్పుకొచ్చింది.
అయితే తనపై జరిగిన ట్రోలింగ్ ను తట్టుకుంటానని, తన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ జరిగితే మాత్రం తట్టుకోలేకపోతున్నానని అంటోంది. ట్రోలింగ్, బాడీ షేమింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ఎదగలేమని, ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్లడమే జీవితమని తెలిపింది జాన్వి.
ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా నెలాఖరుకు రిలీజ్ అవుతోంది. ఇక తెలుగులో ఆమె ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది.