పండగతో పేరు మార్చుకున్న హీరో

ఇకపై తనను జయం రవి అని కాకుండా, రవి మోహన్ అని పిలవాలని కోరుతున్నాడు. ఈ మేరకు లేఖ విడుదల చేశాడు.

హీరోలు పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇప్పటితరం హీరోల వరకు చాలామంది స్క్రీన్ నేమ్స్ మార్చుకున్నారు. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఓ ఇమేజ్ వచ్చిన తర్వాత, జనాల్లో బాగా పాపులర్ అయిన తర్వాత పేరు మార్చుకుంటే అలవాటు పడ్డానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. టైమ్ కూడా పడుతుంది.

అలా ఇబ్బందిగా అనిపించినప్పటికీ తనను కొత్త పేరుతోనే పిలవమని కోరుతున్నాడు జయం రవి. రీసెంట్ గా విడాకుల వ్యవహారంతో వార్తల్లోకెక్కిన ఈ హీరో, ఇకపై తనను జయం రవి అని కాకుండా, రవి మోహన్ అని పిలవాలని కోరుతున్నాడు. ఈ మేరకు లేఖ విడుదల చేశాడు.

“ఈరోజు నుంచి నా పేరు రవి మోహన్. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఈ పేరు నా ఆశయాలను ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త రూపాంతరం లోకి మారిన వేళ, ఇకపై అంతా నన్ను జయం రవి అని కాకుండా రవి మోహన్ అని సంభోదించాలని కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత విన్నపం.”

ఉన్నఫలంగా జయం రవి తన పేరు మార్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు జాతకాలు, న్యూమరాలజీ ప్రకారం తన పేరును మార్చుకున్నాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం, గూగుల్ లో జయం రవి అని టైపు చేస్తే అన్నీ విడాకుల వార్తలే వస్తున్నాయి కాబట్టి, తన పేరును మార్చుకొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

One Reply to “పండగతో పేరు మార్చుకున్న హీరో”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.