కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!

ప్ర‌ధాని మోదీకి కిష‌న్‌రెడ్డితో పాటు చిరంజీవి ద‌గ్గ‌రుండి మ‌రీ ఆహ్వానం ప‌లికారు.

సినిమా వేడుక‌ల్లో ఆ రంగానికి చెందిన ప్ర‌ముఖులు పాల్గొంటే పెద్ద‌గా చ‌ర్చ‌నీయాంశం కాదు. కానీ రాజ‌కీయ నాయ‌కులు నిర్వ‌హించే వేడుక‌ల్లో సినీ సెల‌బ్రిటీలు పాల్గొంటే మాత్రం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఢిల్లీలో త‌న నివాసంలో నిర్వ‌హించిన సంక్రాంతి వేడుక‌ల‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు జాతీయ స్థాయిలో ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. కిష‌న్‌రెడ్డి ఆహ్వానం అందుకున్న ప్ర‌ముఖుల్లో చిరంజీవి కూడా వుండ‌డం విశేషం. ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌ధాని మోదీకి కిష‌న్‌రెడ్డితో పాటు చిరంజీవి ద‌గ్గ‌రుండి మ‌రీ ఆహ్వానం ప‌లికారు.

తెలుగుద‌నం ఉట్టిప‌డే వ‌స్త్ర‌ధార‌ణ‌లో చిరంజీవి క‌నిపించారు. గోమాత‌కు పండ్లను ప్ర‌ధాని తినిపిస్తున్న‌ప్పుడు కిష‌న్‌రెడ్డితో పాటు చిరంజీవి వెంటే ఉండ‌డం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. సీఎంగా చంద్ర‌బాబు, ఆయ‌న కేబినెట్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాని ముఖ్య అతిథిగా హాజ‌రైన సంద‌ర్భంలో కూడా చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మోదీ స‌న్నిహితంగా మెలగ‌డం రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో కిష‌న్‌రెడ్డి ఇంట్లో జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల‌కు చిరంజీవి అతిథిగా వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బీజేపీకి చిరంజీవి ద‌గ్గ‌రగా ఉన్నార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌లేచింది.

2 Replies to “కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.