అంబ‌టి రాయుడు కెరీర్ అత‌ని వ‌ల్లే నాశ‌నం

రాట్‌ కోహ్లీ త‌న‌కు న‌చ్చ‌ని ఆట‌గాళ్ల‌కు ఆడే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని ఆయ‌న ఆరోపించారు.

క్రీడా రంగంలో రాజ‌కీయాల‌కేం త‌క్కువ లేదు. ఆట కంటే ప‌లుకుబ‌డి ఆధారంగానే ఆడించ‌డం లేదా ఆడించ‌క‌పోవ‌డం వుంటుంది. గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వ‌ర‌కూ ఈ రోగం వుంది. అందుకే ఒలంపిక్స్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క ఈవెంట్స్‌లో చిన్న‌చిన్న దేశాలు సైతం ప‌త‌కాలు సాధిస్తున్నా, 140 కోట్ల‌కు పైగా జ‌నాభా వున్న మ‌న దేశం మాత్రం రాణించ‌లేక‌పోతోంది. దీనికి క్రీడారంగంలో రాజ‌కీయాలే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

తాజాగా మ‌న తెలుగు క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు కెరీర్ నాశ‌నం కావడంపై మాజీ ఆట‌గాడు రాబిన్ ఊత‌ప్ప సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2019 వ‌రల్డ్ క‌ప్‌లో అంబ‌టి రాయుడికి ఆడే అవ‌కాశం ఇవ్వ‌కుండా, అత‌ని కెరీర్‌ను టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ నాశ‌నం చేశార‌ని ఊత‌ప్ప సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. 2019 వ‌రల్డ్ క‌ప్ సంద‌ర్భంలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, అలాగే చీఫ్ సెలెక్ట‌ర్‌గా మ్మెస్కే ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రించారు.

త‌న‌కు జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డానికి ఎమ్మెస్కే ప్ర‌సాదే కార‌ణ‌మ‌ని గతంలో అంబ‌టి రాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అయితే త‌న‌ను రాయుడు అపార్థం చేసుకున్నార‌ని, జ‌ట్టు కూర్పులో కెప్టెన్ కూడా కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని అప్ప‌ట్లో ఎమ్మెస్కే చెప్పారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రాబిన్ ఊత‌ప్ప ఆరోప‌ణ‌లు క్రికెట్ రంగంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

విరాట్‌ కోహ్లీ త‌న‌కు న‌చ్చ‌ని ఆట‌గాళ్ల‌కు ఆడే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని ఆయ‌న ఆరోపించారు. అంబటి రాయుడే ఉదాహరణ అని ఊత‌ప్ప వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. మంచి క్రీడాకారుల‌కు ఆడే అవకాశాలు లేకుండా చేయడం సరైంది కాద‌ని ఆయ‌న అన్నారు.

One Reply to “అంబ‌టి రాయుడు కెరీర్ అత‌ని వ‌ల్లే నాశ‌నం”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.