టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల చాన్నాళ్ల తరువాత పెద్ద తెరపై నటించిన సినిమా జయమ్మ పంచాయతీ. మే 6న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ మొత్తం సుమ చేసిన జయమ్మ క్యారెక్టర్ చుట్టూనే తిరిగింది. ఓ విలేజ్. అందులో భిన్న మైన పాత్రలు, జీవితాలు, వాటి నడుమ జయమ్మ ఎమోషన్లు కలగలిపి ట్రయిలర్ కట్ చేసారు.
ట్రయిలర్ చూస్తుంటే ఓ చిన్న పాయింట్ చుట్టూ కథను అల్లుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పాయింట్ ఏమిటన్నది ట్రయిలర్ లో క్లారిటీగా చూపించలేదు. పనిలో పనిగా కులాల అంతరాలు కూడా జోడించారు. పూర్తిగా శ్రీకాకుళం మాండలీకంలో సంభాషణలు పలికించారు.
అయితే సమ నోట ఆ మాండలీకం అంత పెర్ ఫెక్ట్ గా పలకలేదు. పైగా సుమ నటన కూడా కాస్త ఫోర్స్డ్ గా వున్నట్లు అనిపిస్తోంది. సినిమాల్లో చేసి గ్యాప్ రావడం వల్ల కావచ్చు. లేదా సదా జోవియల్ గా, సరదాగా వుండే సుమ, తెరమీద డిఫెరెంట్ గా ప్రెజెంట్ కావడం వల్ల కావచ్చు.
విజయ్ కలివరపు ఈ సినిమాకు దర్శకుడు…బలగ ప్రకాష్ రావు నిర్మాత.