cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

జీవిత స్టేట్ మెంట్ ఎఫెక్ట్ నా?

జీవిత స్టేట్ మెంట్ ఎఫెక్ట్ నా?

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మళ్లీ పోటీ చేసే అవకాశం వుందని నటి జీవిత గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూలో ప్రకటించారు. ఈ మేరకు కథనాలు వెలువడిన, ఇంటర్వూ బయటకు వచ్చిన  కొన్ని గంటల్లోనే మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టడం విశేషం. 

దాదాపుగా ఎన్నికల తరువాత అందరూ మరచిపోయిన మా అసోసియేషన్ భవంతి విషయంలో ప్రకటన చేసారు. ఆరు నెలల్లో భూమి పూజ వుంటుందని వెల్లడించారు.

నిజానికి మంచు విష్ణు ఈ హామీ కచ్చితంగా నెరవేర్చుకోవాలి. తను గెలిచిన వెంటనే స్వంత ఖర్చుతో మా భవనం నిర్మిస్తా అన్నారు. అందువల్లనే కావచ్చు ఆ ఎన్నికల్లో విష్ణు మంచి మెజారిటీతో గెలిచారు. 

ఇప్పుడు ఆ హామీనే కీలకం. ఆ హామీ నెరవేర్చితేనే వచ్చే ఎన్నికల్లో విజయం సులువు అవుతుంది. బహుశా అందుకే ఆ డిమాండ్ ను విష్ణు వ్యతిరేక వర్గం ఎవ్వరూ గుర్తు చేయడం లేదేమో

ఇలాంటి నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మళ్లీ పోటీ చేస్తారనే వార్తలు వచ్చేసరికి మంచు విష్ణు ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అలా అయినా మా సంస్థకు మంచిదేగా.

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?