Advertisement

Advertisement


Home > Movies - Movie News

జిల్ కాంబినేషన్ మరోసారి

జిల్ కాంబినేషన్ మరోసారి

గోపీచంద్ ను మాగ్జిమమ్ స్టయిలిష్ గా చూపించిన సినిమా జిల్. ఆ సినిమా మేకింగ్ చూసిన తరువాతే దర్శకుడు రాధాకృష్ణ కు అవకాశం ఇచ్చాడు హీరో ప్రభాస్. ఆ సినిమానే రాధేశ్యామ్. ఆ భారీ పీరియాడికల్ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ కోసం వెయింటింగ్ లో వున్నారు రాధాకృష్ణ. ఈ వెయిటింగ్ ఇప్పుడు దాదాపు తీరిపోతోంది.

హీరో గోపీచంద్ తోనే మరో సినిమాను చేయబోతున్నారు రాధాకృష్ణ. యువి సంస్థనే నిర్మించబోతోంది. ప్రస్తుతానికి ఇంకా స్క్రిప్ట్ దశలోనే వుందీ సినిమా. గోపీచంద్ చేతిలో ఒక సినిమా వుంది. అది పూర్తయిన తరువాత యువి-రాధాకృష్ణ సినిమా వుంటుంది.

సరైన హిట్ అనేది చూసి చాలా కాలం అయింది హీరో గోపీచంద్. సరైన దర్శకులు కూడా సెట్ కావడం లేదు. ఇలాంటి టైమ్ లో బ్యానర్, డైరక్టర్ అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. స్క్రిప్ట్ కూడా సరైనది వుంటే ఓ హిట్ దొరకచ్చు.

ప్రస్తుతం యువి సంస్థ చకచకా సినిమాలు చేస్తోంది. కేవలం స్వంతగా సినిమాలు చేయడమే కాకుండా, వేరే వాళ్ల భాగస్వామ్యంతో కూడా సినిమాలు చేస్తున్నారు. అటు, పంపిణీ, ఇటు నిర్మాణాలతో పాటు ఎగ్జిబిషన్ రంగంలో కూడా బిజీగా వున్నారు యువి అధినేతలు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?