జోరు మీదున్న వి సెల్యులాయిడ్

యువి సంస్థలో భాగస్వాములైన వంశీ, విక్కీ కలసి సెపరేట్ గా స్థాపించిన సంస్థ వి సెల్యులాయిడ్. ఇది కాక ఈ ఇద్దరు రామ్ చరణ్ తో కలిసి స్టార్ట్ చేసిన విమెగా సంస్థ వేరే…

యువి సంస్థలో భాగస్వాములైన వంశీ, విక్కీ కలసి సెపరేట్ గా స్థాపించిన సంస్థ వి సెల్యులాయిడ్. ఇది కాక ఈ ఇద్దరు రామ్ చరణ్ తో కలిసి స్టార్ట్ చేసిన విమెగా సంస్థ వేరే వుంది. ఇప్పుడు తాత్కాలికంగా యువి సంస్థను పక్కన పెట్టారు. 

వి సెల్యులాయిడ్ మీద వరుసగా నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి-అనుష్కలతో ఓ సినిమా విడుదలకు రెడీగా వుంది. అఖిల్ తో ఓ సినిమా స్టార్ట్ చేయాల్సి వుంది. సుధీర్ బాబుతో ఇప్పుడు ఓ సినిమా అనౌన్స్ చేసారు.

సుధీర్ బాబుతో నిర్మించే సినిమాకు ‘ మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ టైటిల్ ను అనౌన్స్ చేసారు. అభిలాష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. వి సెల్యులాయిడ్ చాలా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. మిడ్ రేంజ్ సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అందుకోసం మిడ్ రేంజ్ హీరోలకు తగిన కథల కోసం అన్వేషిస్తోంది. నితిన్, శర్వానంద్ లతో కూడ సినిమాలు చేసే డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో యువి సంస్థ మీద కొన్ని భారీ సినిమాలు చేసారు. కాస్ట్ ఫెయిల్యూర్ లేదా ప్లానింగ్ ఫెయిల్యర్ ల వల్ల కావచ్చు. గట్టి దెబ్బలు తిన్నారు. ఇప్పుడు వాటి నుంచి తెరుకుని, ముందుకు అడుగేస్తున్నారు.