జూ.ఎన్టీఆర్ సాయం రూ.కోటి

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద వెల్లువెత్తింది. ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మం, విజ‌య‌వాడ న‌గ‌రాల్ని వ‌ర‌ద ముంచెత్తింది. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌ల నష్టం సంభ‌వించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద్ద మ‌న‌సుతో…

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద వెల్లువెత్తింది. ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మం, విజ‌య‌వాడ న‌గ‌రాల్ని వ‌ర‌ద ముంచెత్తింది. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌ల నష్టం సంభ‌వించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద్ద మ‌న‌సుతో ఆదుకుంటే త‌ప్ప‌, రైతాంగం, ప్ర‌జానీకం కోలుకునే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ప్ర‌భుత్వాల‌కు విరాళాలు ఇస్తున్నారు.

ఇందులో భాగంగా హీరో జూ.ఎన్టీఆర్ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతు సాయంగా చెరో రూ.50 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్టు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం విశేషం. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న పోస్టు ఏంటో చూద్దాం.

“రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను”

ఇప్ప‌టికే విరాళాల అంద‌జేత మొద‌లైంది. టాలీవుడ్ నుంచి చెప్పుకోత‌గిన స్థాయిలో విరాళాలు అందాల్సి వుంది. విప‌త్తుల స‌మ‌యంలో టాలీవుడ్ తెలుగు స‌మాజానికి అండ‌గా వుంటున్న సంగ‌తి తెలిసిందే.

7 Replies to “జూ.ఎన్టీఆర్ సాయం రూ.కోటి”

  1. అనేక వ్యాపారాలు వున్న జగన్ ఎంత విరాళం ఇచ్చారు?

    కనీసం తన స్థాయి కి తగ్గట్లు ఒక వంద కోట్లు అయిన

    విరాళం ఇచ్చి వుంటాడు. కదా గ్రేట్ ఆంధ్ర.

    ఓహో, ఇక్కడ జనాలు వరద లో వుంటే, విదేశాలు కి హాలీడే ట్రిప్ కి వెళ్ళారు అంటున్నారు, నిజమేనా?

Comments are closed.