Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంగ్లాండ్ లో ఇల్లాలి తో జూ.ఎన్టీఆర్..!

ఇంగ్లాండ్ లో ఇల్లాలి తో జూ.ఎన్టీఆర్..!

ఇటీవల హీరోలు ఖాళీ దొరికితే చాలు విదేశాలకి చెక్కేస్తున్నారు. ముఖ్యంగా మన స్టార్ హీరోలు. మహేష్ బాబు కొంచెం ఖాళీ దొరికినా చాలు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్తూ ఉంటారు. 

రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కోవలో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య గ్యాప్ దొరికితే ఫారిన్ కి  ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఆనందంగా గడుపుతున్నారు.

RRR సినిమా రిలీజ్ తర్వాత ఖాళీ రావడంతో కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ యూరప్ ట్రిప్ వేశారు . కొరటాల శివతో మొదలవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఇంకా వాయిదా పడుతుంది. దాంతో పాటు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అవ్వడంతో మరోసారి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్ళాడు. 

ఈసారి ఇంగ్లాండ్ వెళ్లినట్టు తెలుస్తుంది. గతంలో తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు తన భార్య ప్రణతతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.

ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటోలో.. ఒక పచ్చని ప్రదేశంలో భార్య ప్రణతకి ఎదురుగా ఎన్టీఆర్ కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తన భార్యతో కలిసి ఇలాంటి క్యూట్ పిక్ షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?