జూబ్లీహిల్స్ ఆఫీసు కొన్న పవన్

తెలుగు సినిమా టాప్ హీరోలు ఆస్తులు కొనుగోలు చేయడం పెద్ద వింత కాదు. అయితే సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. టాప్ హీరోలు భూములపై ఆస్తులపై పెట్టుబడి పెట్టడం మామూలే.  Advertisement పవర్ స్టార్…

తెలుగు సినిమా టాప్ హీరోలు ఆస్తులు కొనుగోలు చేయడం పెద్ద వింత కాదు. అయితే సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. టాప్ హీరోలు భూములపై ఆస్తులపై పెట్టుబడి పెట్టడం మామూలే. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లో 676 గజాల్లో నిర్మించిన 6350 చదరపు గజాల భవనాన్ని ఆయన కొనుగోలు చేసినట్లు ప్రాపర్టీ డీలింగ్ సైట్లలో వార్తలు వచ్చాయి.

ఈ డీల్ జరిగి ఆరునెలులు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ జూబ్లీహిల్స్ లో వుంటున్న నివాసానికి కాస్తే దగ్గరలోనే ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసారు. ప్రస్తుతం ఎవరు వచ్చినా తన ఇంట్లోనే కలవాల్సి వస్తోంది. అలా కాకుండా ఓ ఆఫీసును ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రాపర్టీని కొన్నట్లు తెలుస్తోంది..

మిగిలిన హీరోలతో పోల్చుకుంటే పవన్ ప్రాపర్టీలు తక్కువే. ఎప్పుడో కొన్న ఫార్మ్ హవుస్, ఇప్పుడు వుంటున్న ఇల్లు ఇలా కొన్ని మాత్రమే వున్నాయి. 

అజ్ఞాతవాసి వరకు ఆయన పెద్దగా రెమ్యూనిరేషన్ పరంగా ఆర్జించింది తక్కువ. ఆ మాటకు వస్తే సెకెండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్, భీమ్లానాయక్ తోనే మంచి రెమ్యూనిరేషన్లు అందుకున్నారు.