సుధీర్ బాబుతో నిర్మాత సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న సినిమా హరోం హర. ఇటీవల కాలంలో విపరీతంగా ప్రమోషన్ చేసారు. మే 31న విడుదల అని ఫిక్స్ అయ్యారు. కానీ చూస్తే ఇప్పుడు బోలెడు సినిమాలు అదే డేట్ కు కుమ్మేసుకుంటున్నాయి. పైగా డిజిటల్ హక్కుల డీల్ ఇంకా సెటిల్ కాలేదు. అందుకే బెస్ట్ డేట్ అని జూన్ 14కు రావాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి అయితే ఆ రోజు మరే సినిమా లేదు.
గతంలో సెహరి సినిమా అందించిన జ్ఙాన్ సాగర్ ద్వారక ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదో కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్. 1989 బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుంది. మాళవిక శర్మ కథానాయిక. గతంలో బెల్లంకొండ హీరోతో అల్లుడు అదుర్స్ సినిమా అందించిన సుబ్రహ్మణ్యం, ఆయన కుమారుడు ఈ సినిమాకు నిర్మాతలు.
ఈ సినిమా మీద హీరో సుధీర్ బాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ వైవిధ్యంగా వుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాఫ్. థ్రిల్లర్ జోనర్ తో పాటు యాక్షన్ కలిసింది. అందుకే ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతా అనే నమ్మకంతో వున్నారు. అందువల్ల ఇలాంటి సినిమాను హడావుడిగా, బొలెడు సినిమాల మధ్యలో కాకుండా, మంచి డేట్ కు విడుదల చేయాలని ఆలోచించి, వాయిదా వేసేసారు.