జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆల్ రెడీ గెలిచేసినట్లే. మెజారిటీ ఎంత అన్నదే లెక్క పెట్టాల్సి వుంది. ఇదీ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు ఫ్యాన్స్ ను కదిలిస్తే వినిపించే మాట. దీనికి తోడు కాపు సామాజిక వర్గం ‘మా వాడు’ అని బాగా ఓన్ చేసుకున్నారు. అందువల్ల గెలుపు సునాయాసం అయింది అన్నది అక్కడి మాట. బాగానే వుంది. కానీ ఇప్పుడు ‘తమ పవన్ కళ్యాణ్’ ఎక్కడ వున్నారో ఏ ఒక్కరికైనా తెలుసా? అంటే నో అనే అన్సర్ నే వస్తుంది.
ప్రైవేట్ లైఫ్ వుండదా అని అడగవచ్చు. కానీ పబ్లిక్ లైఫ్ లో వున్నవారికి వుండదు. ఎందుకంటే ఎక్కడ వున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి సర్వత్రా వుంటుంది. పైగా విదేశాలకు రెస్ట్ తీసుకోవడానికి వెళ్లడం తప్పేం కాదు. సీక్రెట్ గా వుంచాల్సినంత పనీ లేదు.
పోలింగ్ కు రెండు రోజుల ముందే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వచ్చేసారు. అక్కడ వుండనే లేదు. ఆ తరువాత మరి మళ్లీ గెలిచిన తరువాత వెళ్తారేమో? వెళ్లినా అక్కడ వన్ డే వుంటారా? అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రచారం టైమ్ లోనే ఎప్పటికప్పుడు హెలికాప్టర్ పెట్టుకుని మంగళగిరి వచ్చేసేవారు.
మరి పవన్ గెలిచాక జనం తమ సమస్యలను పవన్ కు ఎలా చెప్పుకుంటారో? చూడాలి. లేదా పవన్ తరపున ప్రతినిధిగా ఎవరన్నా అక్కడ వుంటారేమో? తెలుగుదేశం నాయకుడు వర్మకే ఆ బాధ్యతలు అప్పగిస్తారో లేదా జనసేన నుంచి ఎవరినైనా వుంచుతారో.. ఓ రెండు వారాలు ఆగితే క్లారిటీ వస్తుంది.